Breaking News

ఓటీటీలోకి 'వార్ 2'.. అధికారిక ప్రకటన

Published on Wed, 10/08/2025 - 14:13

ఈ ఏడాది ఎన్టీఆర్.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా 'వార్ 2'. హృతిక్ రోషన్ మరో హీరోగా నటించాడు. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో అయితే మరీ ఘోరమైన టాక్ వచ్చింది. హిందీలో ఓ మాదిరి కలెక్షన్స్ వచ్చాయి. గత కొన్నిరోజులుగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై పలు రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడ వాటికి చెక్ పెడుతూ అధికారిక ప్రకటన వెలువడింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)

'వార్ 2' డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు అలా రేపటి(అక్టోబరు 09) నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే వారంనుంచి ఇదే తేదీన రానుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. థియేటర్లలో అంతంత మాత్రంగా ఆడిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి?

'వార్ 2' విషయానికొస్తే.. రా మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని తమ కార్టెల్‌లో భాగం చేసుకోవాలనేది కలి అనే విలన్ ప్లాన్. దీంతో టాస్క్ పేరు చెప్పి కబీర్‌తో తనకి గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లుథ్రాని చంపించేస్తారు. దీంతో కబీర్‌ని పట్టుకునేందుకు రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్), భారత ప్రభుత్వం సోల్జర్ విక్రమ్ చలపతి (ఎన్టీఆర్) నేతృత్వంలో ఓ టీమ్ రంగంలోకి దింపుతుంది. ఆ బృందంలో లూథ్రా కూతురు, వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అడ్వాణీ) కూడా ఉంటుంది. అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? కబీర్‌కి విక్రమ్ ఎవరో తెలిశాక ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: హిట్ సినిమా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)