Breaking News

ఓటీటీలోకి 'వార్ 2'.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?

Published on Sun, 09/28/2025 - 21:21

ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తీస్తున్న 'డ్రాగన్' మూవీ చేస్తున్నాడు. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. దీంతో దాదాపుగా షూటింగ్ పూర్తి కానుంది. మరోవైపు నెలన్నర క్రితం 'వార్ 2' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. హిందీలో ఓ మాదిరిగా ఆడింది గానీ తెలుగులో చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చినట్లు కనిపించలేదు. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్.. హిందీలో 'వార్ 2' చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్పై యూనివర్స్‌లో వచ్చిన సినిమా ఇది. హృతిక్ రోషన్, తారక్ లీడ్ రోల్స్ చేశారు. కియారా అడ్వాణీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న దేశవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. అయితే టాక్ ఏ మాత్రం పాజిటివ్ రాకపోవడంతో వసూళ్లు కూడా తక్కువగానే వచ్చాయి.

(ఇదీ చదవండి: నొప్పితోనే 'కాంతార 1' ఈవెంట్‌కు ఎన్టీఆర్)

ఇకపోతే హిందీ సినిమాలు చాలావరకు 8 వారాల విండోతోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు 'వార్ 2' కూడా అలానే నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతుందని, అయితే దసరా సందర్భంగా ఈ వీకెండ్‌లో స్ట్రీమింగ్ అయినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదని మరో మాట వినిపిస్తుంది. ఇదే జరిగితే అక్టోబరు 2న లేదంటే 9న రావొచ్చని టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి?

'వార్ 2' విషయానికొస్తే.. రా మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని తమ కార్టెల్‌లో భాగం చేసుకోవాలనేది కలి అనే విలన్ ప్లాన్. దీంతో టాస్క్ పేరు చెప్పి కబీర్‌తో తనకి గాడ్ ఫాదర్ లాంటి సునీల్ లుథ్రాని చంపించేస్తారు. దీంతో కబీర్‌ని పట్టుకునేందుకు రా కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్), భారత ప్రభుత్వం సోల్జర్ విక్రమ్ చలపతి (ఎన్టీఆర్) నేతృత్వంలో ఓ టీమ్ రంగంలోకి దింపుతుంది. ఆ బృందంలో లూథ్రా కూతురు, వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అడ్వాణీ) కూడా ఉంటుంది. అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? కబీర్‌కి విక్రమ్ ఎవరో తెలిశాక ఏం చేశాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్ నిశ్చితార్థం.. చైతూ-శోభిత సందడి)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)