ఒక్క డైలాగ్‌తో ఫేమస్‌.. నా గొంతు మార్చేశారు, ఇది చాలా తప్పు!

Published on Wed, 09/17/2025 - 14:07

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ 'బీస్ట్‌' సినిమాతోనే తెలుగులో ఫుల్‌ బిజీ అయిపోయానంటున్నాడు తమిళ నటుడు వీటీవీ గణేశ్‌ (VTV Ganesh). టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తున్నానని చెప్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ చిత్రం కిస్‌ ప్రెస్‌మీట్‌కు హాజరయ్యాడు. కెవిన్‌, ప్రీతి అస్రాని జంటగా నటించిన ఈ సినిమాకు కొరియోగ్రాఫర్‌ సతీశ్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్‌ 19న విడుదల కానుంది.

ఒక్క డైలాగ్‌తో పాపులర్‌
ఈ మూవీ ప్రెస్‌మీట్‌లో గణేశ్‌ మాట్లాడుతూ.. బీస్ట్‌ సినిమాలో ఎవర్రా, నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్‌ అనే ఒక్క డైలాగ్‌తో నేను తెలుగు ఇండస్ట్రీలో ఫేమసయ్యాను. ఈ సినిమాలో ఛాన్సిచ్చిన విజయ్‌ సర్‌కు థాంక్స్‌ చెప్పుకుంటున్నా.. నా గొంతే నా బలం. ఇప్పుడు తెలుగులో చిరంజీవి, నాగచైతన్య.. వంటి స్టార్‌ హీరోలతో దాదాపు 8 సినిమాలు చేస్తున్నాను. ఇకపోతే కిస్‌ మూవీ తెలుగు ట్రైలర్‌లో నా గొంతు మార్చేశారు. ఇది కరెక్ట్‌ కాదు. 

ఈజీగా తప్పించుకుంటారు
నాకు తెలుగొచ్చు. రేపే డబ్బింగ్‌ చెప్పమన్నా చెప్తాను. నా వాయిస్‌ ఎందుకు ఉపయోగించుకోలేదని దర్శకుడిని అడిగినప్పుడు ఏమో, నాకు తెలీదు, చూద్దాం అని తప్పించుకున్నాడు. అదే లేడీ డైరెక్టర్‌ అయ్యుంటే సరే, నేను చెక్‌ చేస్తాను అని సరి చేసుకోవడానికి ప్రయత్నించేది. మేల్‌ డైరెక్టర్లు ఈజీగా తెలీదని తప్పించుకుంటారు అని కాస్త అసహనం వ్యక్తం చేశాడు. గణేశ్‌.. తెలుగులో భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్‌, సంక్రాంతికి వస్తున్నాం, సింగిల్‌ సినిమాల్లో నటించాడు. తమిళ 'జైలర్‌', 'వారసుడు', 'డాడా'(పాపా), 'ప్రిన్స్‌' మూవీస్‌తోనూ అలరించాడు.

చదవండి: ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టిన 'మిరాయ్‌'

Videos

అంబేద్కర్ రాజ్యాంగం దిండు కింద పెట్టి.. లోకేష్ రాజ్యాంగం నడుపుతున్నారు

వరుణుడి ఉగ్రరూపం.. హైదరాబాద్ ను ముంచెత్తిన వాన

అప్పులు చేయడంలో దేశంలో ఆగ్రగామిగా ఆంధ్రప్రదేశ్

సనాతన శాఖా మంత్రి పవన్.. ఇంత అపచారం జరిగితే ఎక్కడ దాక్కున్నావ్

మీకు సిగ్గుచేటుగా లేదా.. పదే పదే సునీతని,షర్మిలని పెట్టుకుని.. ABNకు సతీష్ రెడ్డి కౌంటర్

దేవుడున్నాడు.. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అండ్ కో

ఏడుగురు మృతికి కారకుడైన టీడీపీ నేత

DSC అభ్యర్థుల ఎంపికలో భారీ కుట్ర

Big Question: మీ పాపాలకు అంతం అతి త్వరలోనే!!

అనంతపురం సభలో సిగ్గు లేకుండా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు

Photos

+5

షారుక్‌ ఖాన్‌ కుమారుడి కోసం తరలిన అంబానీ ఫ్యామిలీ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో కుండపోత బీభత్సం.. నీటమునిగిన పలు ప్రాంతాలు (ఫొటోలు)

+5

లండన్‌ వేకేషన్‌లో హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు (ఫొటోలు)

+5

తొలిసారి ఒంటరిగా.. యాంకర్ అనసూయ పోస్ట్ (ఫొటోలు)

+5

సిద్దార్థ్-అదితీ పెళ్లిరోజు సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘మిరాయ్‌’ మూవీ సక్సెస్ మీట్‌లో మెరిసిన శ్రియా శరణ్ (ఫొటోలు)

+5

నవరాత్రులకు సిద్దమైన అమ్మవారి విగ్రహాలు రండి చూసేద్దాం (ఫొటోలు)

+5

విజయవాడలో ‘మిరాయ్‌’ మూవీ విజయోత్సవం (ఫొటోలు)

+5

నేడు ప్రధాని మోదీ పుట్టినరోజు.. ఈ ఫొటోలు చూశారా..