Breaking News

వాళ్లు ఉన్నంత కాలం సినీ పరిశ్రమ మునిగిపోతుంది: డైరెక్టర్‌

Published on Fri, 07/15/2022 - 20:31

Vivek Agnihotri Comments On Shahrukh And Salman Khan: చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ మూవీ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రికి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ప్రస్తుతం 'ది ఢిల్లీ ఫైల్స్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న అగ్నిహోత్రి బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

'కింగ్స్‌, బాద్‌షాలు, సుల్తాన్‌లు ఉన్నంత కాలం బాలీవుడ్‌ మునిగిపోతూనే ఉంటుంది. ప్రజల గాథలతో సినిమాలు తీస్తూ ప్రజల పరిశ్రమగా మార్చాలి. అది మాత్రమే ప్రపంచ చలనచిత్ర పరిశ్రమగా అభివృద్ధి చెందుతుంది' అని సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్‌ చేశారు వివేక్‌ అగ్నిహోత్రి. అయితే ఈ ట్వీట్ కింగ్‌ ఖాన్ షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ను పరోక్షంగా విమర్శించినట్లు తెలుస్తోంది. 

చదవండి: అన్నదమ్ములతో డేటింగ్‌ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్‌
మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్‌.. యాంకర్‌పై ఆగ్రహం

కాగా కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో సుమారు రెండేళ్లు సినీ ఇండస్ట్రీ నష్టాలు ఎదుర్కొంది. దీంతో ఓటీటీలు పుంజుకున్నాయి. ఈ క్రమంలేనే ప్రేక్షకుల అభిరుచి మారింది. ఈ మార్పుతో హిందీ ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలను తిరస్కరించారు. అదే సమయంలో ఊరమాస్‌ స్టైల్‌లో వచ్చిన దక్షిణాది చిత్రాలను మాత్రం విపరీతంగా ఆదరించారు. ఇంకా చెప్పాలంటే హిందీ చిత్రాలకంటే దక్షిణాది డబ్బింగ్‌ మూవీస్‌ ఎక్కవ కలెక్షన్లు రాబట్టాయి. ఈ పరిణామంతో బాలీవుడ్ స్టార్స్‌పై విమర్శలు రాజుకున్నాయి. ఈ క్రమంలోనే వివేక్ అగ్నిహోత్రి ఈ ట్వీట్‌ చేసినట్లు తెలుస్తోంది. 

చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?..
'ఆర్‌ఆర్‌ఆర్‌'పై పోర్న్‌ స్టార్‌ ట్వీట్‌.. నెట్టింట జోరుగా చర్చ

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)