Breaking News

తెలుగు డైరెక్టర్లు ఎవరూ నాతో సినిమా చేయరు.. అందుకే!: విష్ణు

Published on Mon, 06/30/2025 - 15:55

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు (Vishnu Manchu)కు హిట్టు పడి చాలా ఏళ్లే అయింది. ఆయన చివరగా జిన్నా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. ఈసారి రొటీన్‌ సినిమాలు కాదని తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్పను పట్టాలెక్కించాడు. దీనికోసం ఎంతో అధ్యయనం చేసిన తర్వాతే కన్నప్ప షూటింగ్‌ మొదలుపెట్టాడు. మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌, శరత్‌ కుమార్‌ వంటి బడా తారలు కీలక పాత్రలు పోషించారు. 

కన్నప్పపై ట్రోలింగ్‌
మహాభారత్‌, రామాయణ్‌ సీరియల్స్‌ తెరకెక్కించిన హిందీ దర్శకుడు ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ (Mukesh Kumar Singh) ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశాడు. జూన్‌ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ లభిస్తోంది. దీంతో సినిమా సక్సెస్‌ మీట్‌ కూడా నిర్వహించారు. ఈ వేడుకలో విష్ణు.. కన్నప్పపై జరిగిన ట్రోలింగ్‌ గురించి మాట్లాడాడు. కన్నప్ప సినిమా టీజర్‌ రిలీజైనప్పుడు ఉత్తి పుణ్యానికే నెగెటివిటీ ప్రచారం చేశారు. యూట్యూబ్‌లో నాన్నగారి గురించి, నా గురించి ఏమీ లేకపోయినా నెగెటివ్‌ థంబ్‌నైల్స్‌ పెడితే వారికి ఎక్కువ క్లిక్స్‌ వస్తున్నాయి, ఆదాయం వస్తోంది. 

వీఎఫ్‌ఎక్స్‌ గుర్తించలేకపోయారు
అది ఎంత పెద్ద తప్పని వారు రియలైజ్‌ అవట్లేదు. లొకేషన్స్‌ బాలేవు, గ్రాఫిక్స్‌ బాగోలేవు అని నానామాటలు అన్నారు. చాలామందికి తెలియని విషయమేంటంటే నేను రిలీజ్‌ చేసిన మొదటి టీజర్‌లో చాలా తక్కువ వీఎఫ్‌ఎక్స్‌ ఉన్నాయి. రెండో టీజర్‌లో మాత్రం 70% వీఎఫ్‌ఎక్స్‌ ఉన్నాయి. అదెవరూ గుర్తించలేకపోయారు. మోహన్‌లాల్‌గారి ఎపిసోడ్‌లో ఆ బాణాలు తప్ప అన్నీ ఒరిజినలే! రియల్‌ లొకేషన్‌లో షూట్‌ చేశాం అన్నాడు. 

నాతో ఎవరూ చేయరు
తెలుగులో లెజెండరీ డైరెక్టర్స్‌ ఉన్నా, హిందీలో ముకేశ్‌ కుమార్‌నే ఎందుకు నమ్మారు? ఆయనకే ఎందుకు డైరెక్షన్‌ బాధ్యతలు ఇచ్చారన్న ప్రశ్న ఎదురైంది. అందుకు విష్ణు స్పందిస్తూ.. నాతో తెలుగులో ఏ డైరెక్టర్‌ పని చేయరని నాకు తెలుసు. కన్నప్ప స్క్రిప్ట్‌ తీసుకెళ్తే ఎవరూ నాతో చేయరని అందరికీ తెలుసు. పైగా దీనికంటే ముందు నేను చేసిన రెండు,మూడు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. అందువల్ల ఇక్కడ ఎవరూ చేయరు. మహాభారతాన్ని (సీరియల్‌) అంత గొప్పగా తీసిన ముకేశ్‌ కన్నప్పను అంతే అద్భుతంగా తెరపై చూపించగలరని నమ్మాను అని చెప్పాడు. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం విశేషం!

చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)