Breaking News

సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు

Published on Sat, 08/16/2025 - 14:27

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన 'కూలీ', 'వార్ 2'కి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ వీకెండ్, సెలవులు కలిసి రావడంతో జనాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఓటీటీల్లోనూ పలు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో చాలా వరకు డబ్బింగ్ చిత్రాలే ఉన్నాయి. అయితే ఎలాంటి ప్రకటన లేకుండా రెండు తెలుగు మూవీస్ కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ ఏంటవి? ఎందులో చూడొచ్చు?

గత నెల తొలివారం థియేటర్లలోకి వచ్చిన 'వర్జిన్ బాయ్స్' సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. కాకపోతే ఐఫోన్, డబ్బులు గిఫ్ట్స్ అనే ప్రమోషన్లతో వార్తల్లో నిలిచింది. అడల్ట్ కాన్సెప్ట్‌, యువతని టార్గెట్ చేసుకుని తీసిన ఈ చిత్రం.. ఇప్పుడు ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి వచ్చేసింది. తెలుగులోకి అందుబాటులో ఉంది.

(ఇదీ చదవండి: విజయ్‌తో రొమాంటిక్‌ స్టిల్‌.. ‘చాలా స్పెషల్‌’ అంటూ రష్మిక పోస్ట్‌)

మరోవైపు ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన 'సూర్యాపేట్ జంక్షన్' అనే తెలుగు సినిమా కూడా ఎలాంటి హడావుడి లేకుండానే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ విషయానికొస్తే.. అర్జున్‌ (ఈశ్వర్) కాలేజీలో చదువుతూ స్నేహితులతో జాలీ లైఫ్ గడుపుతుంటాడు. జ్యోతితో(నైనా సర్వర్) ప్రేమలో పడతాడు. మరోవైపు నరసింహ (అభిమన్యు సింగ్) ఎమ్మెల్యే అయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు.

అయితే అర్జున్‌ స్నేహితుల్లో ఒకడైన శీను.. ఓ రోజు హత్యకు గురవుతాడు. శీనుని ఎవరు చంపారు? ఆ ఘటన వెనకున్న  రాజకీయ కుట్ర ఏంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఈ రెండు సినిమాలతో పాటు వీకెండ్ ఓటీటీల్లో రిలీజైన వాటిలో 'జానకి.వి vs స్టేట్ ఆఫ్ కేరళ', 'గ్యాంబ్లర్స్', 'సూపర్ మ్యాన్' తదితర చిత్రాలు కూడా ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. 

(ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ)

Videos

ప్రభాస్ బర్త్‌డే స్పెషల్... కల్కీ 2 నుంచి అదిరిపోయే వీడియో

వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ లేఖ

మే. 2029 వరకు మీరు తగ్గకండి నేను తగ్గను... నేను చాగంటి లా ప్రవచనాలు చెప్పే రకం కాదు

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

ధరల పెరుగుదలపై లోకేష్‌కు వరుదు కళ్యాణి సవాల్..!

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

Photos

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)