Breaking News

‘హనుమాన్‌ అంశ్‌2’లో కోహ్లీ,అనుష్క శర్మ.. నిజమెంత?

Published on Thu, 09/10/2026 - 20:15

బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘హనుమాన్‌ అంశ్‌’ సినిమా పేరు మార్మోగుతోంది.  ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్‌ భక్తుడు నీమ్‌ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్‌ చతుర్వేది.  ఈ చిత్రం ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్స్‌గా రానున్న ‘హనుమాన్‌ అంశ్‌2’, ‘హనుమాన్‌ అంశ్‌3’పై ఆసక్తి పెరిగింది. పార్ట్‌2లో పలువురు ప్రముఖులు నటించనున్నారని వస్తున్న వార్తలపై ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, నటి అనుష్క శర్మ పేర్లు తెరపైకి వచ్చాయి.

నిర్మాత ఏమన్నారంటే..
‘హనుమాన్‌ అంశ్‌2’లో విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ అతిథి పాత్రల్లో కనిపిస్తారా? అనే ప్రశ్నకు నిర్మాత నమ్రతా సింగ్‌ ఆసక్తికరంగా స్పందించారు. కొందరు సెలబ్రిటీలను ఇప్పటికే సంప్రదించినట్లు ఆమె వెల్లడించారు. ఇప్పటికే పార్ట్‌2 కథ పలువరి సెలబ్రిటీలకు తెలుసునని తెలిపారు. అయితే విరాట్‌, అనుష్క ఇద్దరూ సినిమాలో నటించేందుకు అంగీకరించారా లేదా అని మాత్రం ఆమె స్పష్టంగా తెలపలేదు.

చదవండి: సమంత ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ ఇంత ఖరీదా..? డిజైనర్‌ ఎవరంటే.?

కాగా విరాట్‌-అనుష్కలకు నీమ్‌ కరోలి బాబాపై ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట పలు సందర్భాల్లో కైంచీ ధామ్‌ను సందర్శించింది. ఈ నేపథ్యంలోనే ‘హనుమాన్‌ అంశ్‌’లో వీరిద్దరినీ భాగం చేయాలనే ఆలోచన ఆసక్తిని కలిగిస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మూడు భాగాలుగా..
ఇక ‘హనుమాన్‌ అంశ్‌’ను మొదటి నుంచే మూడు భాగాలుగా తెరకెక్కించాలని భావించినట్లు నిర్మాత తెలిపారు. ‘తొలి భాగంలో నీమ్‌ కరోలి బాబా ప్రారంభ జీవితం నుంచి కైంచీ ధామ్‌( ఆధ్యాత్మిక ఆశ్రమం) వరకు చూపించాం. రెండో భాగం కైంచీ ధామ్‌, అక్కడి భారతీయ భక్తుల కథలపై తెరకెక్కిస్తాం. మూడో భాగంలో బాబా ఆధ్యాత్మిక ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందనే అంశాన్ని చూపించబోతున్నాం’ అని తెలిపారు. అయితే విరాట్‌-అనుష్కలు ఇందులో కనిపిస్తారా? లేదా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.

ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ షాలిని జీవితంలో ఇంత విషాదమా?

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)