జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?
Breaking News
పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నిర్మాత కుమార్తె.. తండ్రి ఎమోషనల్ పోస్ట్!
Published on Fri, 06/09/2023 - 16:22
ప్రముఖ చిత్రనిర్మాత విక్రమ్ భట్ కూతురు కృష్ణ భట్ పెళ్లి పీటలెక్కనుంది. తన ప్రియుడు వేదాంత్ సర్దాను ఈ నెలలోనే వివాహాం చేసుకోనుంది. ఈ ప్రేమజంట పెళ్లి జూన్ 11న ముంబైలో పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని విక్రమ్ భట్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన కుమార్తె కృష్ణ భట్కు.. గతేడాది డిసెంబర్లో వేదాంత్ సర్దాతో నిశ్చితార్థం అయినట్లు తెలిపారు.

(ఇది చదవండి: పంచ్ ప్రసాద్కు ఆపరేషన్.. అండగా ఉంటామన్న ఏపీ సీఎంవో)
కాగా కృష్ణ భట్ నిర్మాతగా '1920 - హారర్స్ ఆఫ్ ది హార్ట్' అనే సినిమాతో ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ భట్, ఆనంద్ పండిట్ సమర్పణలో రాజ్ కిషోర్ ఖవారెతో కలిసి విక్రమ్ భట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 23న థియేటర్లలోకి రానుంది.

(ఇది చదవండి: స్నేహం పేరుతో నమ్మించి.. బాలికపై అత్యాచారం.. సింగర్ అరెస్ట్)
Tags : 1