Breaking News

వెంటిలేటర్‌పై సీనియర్ నటుడు ధర్మేంద్ర.. స్పందించిన టీమ్!

Published on Mon, 11/10/2025 - 18:17

బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఆరోగ్యం విషమంగా ఉందని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని నెట్టింట వార్తలొచ్చాయి. ఇటీవలే ఆయన ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉందని సోషల్ మీడియాలో కథనాలొచ్చాయి. దీంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మేంద్రపై వస్తున్న కథనాలపై ఆయన టీమ్ స్పందించింది.

అయితే ధర్మేంద్ర ఆరోగ్యంపై వస్తున్న కథనాలన్నీ అవాస్తమని ఆయన టీమ్ కొట్టిపారేసింది. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని తెలిపింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారన్న వార్తలు నిజం కాదని టీమ్ స్పష్టం చేసింది. ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ కూడా ఆస్పత్రికి వెళ్లి వచ్చారని వెల్లడించింది. అలాంటిది ఏదైనా జరిగి ఉంటే అతని కుటుంబం మొత్తం ఆసుపత్రిలో ఉండేదని పేర్కొంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన ‍అవసరం లేదని టీమ్ తెలిపింది.

కాగా.. ధర్మేంద్ర అక్టోబర్ 31న సాధారణ చెకప్‌ కోసం ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో అతని భార్య హేమ మాలిని కూడా ఆయన బాగానే ఉన్నారని వెల్లడించారు. ఇక సినిమాల విషయానికొస్తే ధర్మేంద్ర చివరిసారిగా 2024లో విడుదలైన తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా చిత్రంలో  కనిపించారు. ప్రస్తుతం ఆయన నటించిన అగస్త్య నందా  ఇక్కిస్ చిత్రం ఉంది ఈ ఏడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది.
 

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)