Breaking News

ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్

Published on Mon, 07/20/2026 - 09:23

మరోవారం వచ్చేసింది. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ నటించిన చిట్టచివరి సినిమా 'జన నాయగన్' ఈ గురువారం థియేటర్లలోకి రానుంది. తెలుగులో అయితే కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' రిలీజ్ కానుంది. దీనితో పాటు కాజల్ 'ద ఇండియా స్టోరీ' సహా హే చికితా, చంద్రప్పన్, కాగితం పడవలు లాంటి చిన్న చిత్రాలు బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.

(ఇదీ చదవండి: ఒకే ఓటీటీలోకి ఏకంగా 60 సినిమాలు.. తెలుగు నుంచి తొమ్మిది)

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈ వీకెండ్ చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ అయితే లేవు. ఉన్నంతలో పల్లిచట్టంబి, కాన్ సిటీ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు ముసాఫిర్ కేఫ్, ఆదర్శ్ బాలవిద్యాలయ లాంటి సిరీస్‌లు కాస్తోకూస్తో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఇంకేమైనా సర్‌ప్రైజ్ స్ట్రీమింగ్ లాంటివి ఉంటాయేమో చూడాలి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రిలీజ్ కానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 20 నుంచి 26 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • ఏ టాక్సిక్ లవ్ స్టోరీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - జూలై 22

  • ఎలైట్ ఫోర్స్ (ఫ్రెంచ్ సిరీస్) - జూలై 22

  • రాన్సమ్ కెన్యన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23

  • ద డెట్ కలెక్టర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 23

  • ద ట్రూతర్స్ (స్పానిష్ మూవీ) - జూలై 24

  • 72 అవర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24

  • లాస్ క్రెయంటస్ (స్పానిష్ మూవీ) - జూలై 24

  • ముసాఫిర్ కేఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24

  • కాన్ సిటీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూలై 24 (రూమర్ డేట్)

హాట్‌స్టార్

  • స్టువర్ట్ ఫెయిల్స్ టూ సేవ్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24

  • బ్లీచ్: థౌజండ్-ఇయర్ బ్లడ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25

అమెజాన్ ప్రైమ్

  • ఆదర్శ్ బాల్ విద్యాలయ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూలై 24

జీ5

  • అగ ఆయ్ అహో ఆయ్ (మరాఠీ సిరీస్) - జూలై 24

  • ప్రేమ్ షాట్స్ (బెంగాలీ సిరీస్) - జూలై 24

సోనీ లివ్

  • పల్లిచట్టంబి (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 24

లయన్స్ గేట్ ప్లే

  • ప్రొటెక్టర్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 24

ఆపిల్ ప్లస్ టీవీ

  • ద డింక్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 24

సన్ నెక్స్ట్

  • సీక్రెట్ ఆఫ్ కళింగ (మలయాళ మూవీ) - జూలై 24

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కోర్ట్ రూమ్ థ్రిల్లర్)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)