Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా
Breaking News
కొత్త కారు కొన్న మెగా కోడలు ఉపాసన, ధరెంతో తెలుసా?
Published on Tue, 05/24/2022 - 21:07
Upasana Buy Brand New Luxury Car Video Viral: మెగా కోడలు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ భార్యగా, అపొలో అధినేత మనవరాలిగా కాకుండ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. ఫిట్ నెస్, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను అభిమానులతో షేర్ చేసుకుంంటుంటారామె. ఈ నేపథ్యంలో తనకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్‌ను పంచుకున్నారు ఉపాసన. తాను సూపర్ లగ్జరీ ఆడి కొత్త కారు కొన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.
చదవండి: ఆఫర్ల కోసం చాలామంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారు: డైరెక్టర్
ఈ మేరకు ఉపాసన ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ప్రగతి శీలంగా స్థిరమైన, విలాసవంతమైన భవిష్యత్తును నిర్మించడానికి ఇదే ఆరంభం అంటూ ఉపాసన పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా తన లగ్జరీ కారుకు సంబంధించిన ఫీచర్స్ ఎలా ఉన్నాయో వివరిస్తూ ఆమె వీడియోను వదిలారు. ‘నా దృష్టిలో భవిష్యత్తు అంటే సుస్థిరతతో పాటు ప్రగతి శీలమైన లగ్జరీ కూడా కలిసి ఉండటమే. నా ఈ ఆడి ఈ-ట్రాన్(Audi E-Tron) ఆ రెండింటిని కలిగి ఉంది. అత్యాధునిక సౌకర్యాలను కలిగిన ఈ లగ్జరీ ఆడి కారు ఎంతో సురక్షితమైంది’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాగా ఉపాసన కొన్న ఈ లగ్జరి ఆడి ఈ-ట్రాన్ కారు ధర దాదాపు కోటి ఇరవై లక్షల వరకు ఉంటుందని సమాచారం.
Tags : 1