Breaking News

'ఆ దేవుడి ఆశీర్వాదం వల్లే బతికిపోయా..' ప్రముఖ బుల్లితెర నటి

Published on Sun, 01/12/2025 - 16:28

లాస్‌ ఎంజిల్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నానని ‍ప్రముఖ బుల్లితెర నటి రూపల్ త్యాగి తెలిపింది. చదువు కోసం వెళ్లి కొన్ని నెలలపాటు అక్కడే ఉన్నానని గుర్తు చేసుకుంది. ఇటీవల దాదాపు నెల రోజులు పాటు అక్కడే ఉన్నానని వెల్లడించింది. తాను స్వదేశానికి విమానంలో బయలుదేరినప్పుడు ఆకాశంలో దట్టమైన పొగలు చూశానని చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రమాదం ఇంత స్థాయిలో ఉంటుందని ఊహింలేదన్నారు. తాను చూసిన ప్రదేశాలు బూడిదగా మారడం చూసి హృదయ బద్దలైందని విచారం వ్యక్తం చేసింది.

రూపల్ త్యాగి మాట్లాడుతూ.. "పొడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ  అగ్ని ప్రమాదాలు సాధారణమే. కానీ అది అంత తీవ్రంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. నేను విమానం నుంచి పొగను చూశా. అప్పుడే ఇక్కడ ప్రమాదాలు మామూలే అని అనుకున్నా. కానీ నేను ముంబయిలో దిగే సమయానికి కార్చిచ్చు వల్ల ఎంత ప్రమాదం జరిగిందో అప్పుడే తెలిసింది. నేను చూసిన ప్రదేశాలు ప్రతిదీ కాలిపోయాయని నాకు తెలిసింది. దృశ్యాలను చూస్తుంటే హృదయ విదారకంగా అనిపించింది. తాను ఇంటికి తిరిగి వచ్చే ముందు అదే రోడ్డులో కారులో ప్రయాణించా. ఇప్పుడు ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది.  అదృష్టవశాత్తూ నా స్నేహితులందరూ సురక్షిత ప్రాంతంలో ఉన్నారు. నేను వారి గురించి ఆందోళన చెందుతున్నా. సమయానికి బయలుదేరి ప్రాణాలు దక్కించుకోవడం ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ సంక్షోభ సమయంలో నా స్నేహితులతో లేకపోవడం నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రకృతి కోపాన్ని చూసి చలించిపోయా' అని అన్నారు.

ఇలాంటి సంఘటనలు మన జీవితాలు ఊహించని విధంగా మార్చేస్తాయని రూపల్ త్యాగి  అన్నారు. ఒక్క రోజులోనే నగరం  కాలిపోతుందని ఎవరూ ఊహించరు.. ఇది నమ్మశక్యం కాని ఘటన అని చెప్పింది. మన జీవితంలో ప్రతి రోజు పూర్తిగా అస్వాదించాలనేన ఆలోచన మంచిదే.. ఎందుకంటే మరుసటి రోజు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఈ ప్రమాదంలో నిరాశ్రయులైన ప్రజలు త్వరలోనే కోలుకుని మళ్లీ సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

కాగా.. అమెరికాలో లాస్ ఏంజిల్స్‌లో చెలరేగిన కార్చిచ్చు వల్ల దాదాపు వేలమంది నిరాశ్రయులయ్యారు. అడవిలో ఏర్పడిన మంటలు గాలి ధాటికి విధ్వంసం సృష్టించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 12 వేలకు పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంకా మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. వచ్చే వారం ప్రారంభంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అక్కడి అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కాగా.. రూపల్ త్యాగి బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో నటించింది. బాలీవుడ్‌లో కసమ్‌ సే, దిల్ మిల్ గయే, శక్తి- అస్తివా కే ఎసాస్‌ కీ, యంగ్ డ్రీమ్స్, రంజు కీ బేటియాన్, హమారీ బేటియాన్ కా వివాహ్ లాంటి హిందీ సీరియల్స్‌లో కనిపించింది. బెంగళూరుకు చెందిన రూపల్ త్యాగి కొరియోగ్రాఫర్‌గా కూడా రాణిస్తోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)