Breaking News

త్రిష ఇంట్లో దళపతి విజయ్.. ఆ రూమర్స్ నిజమేనా?

Published on Mon, 06/23/2025 - 08:09

తమిళ హీరో విజయ్, హీరోయిన్ త్రిష గురించి ఏడాది క్రితం కొన్ని రూమర్స్ వచ్చాయి. వీళ్లిద్దరూ ప్రస్తుతం డేటింగ్‪‌లో ఉన్నారని, త్వరలో ఒక్కటయ్యే అవకాశాలున్నాయని కాస్త గట్టిగానే తమిళ మీడియాలో వినిపించింది. తర్వాత కొన్నిరోజులకు అంతా సైలెంట్ అయిపోయింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్రిష పెట్టిన ఫొటోనే అందుకు కారణం.

దళపతి విజయ్.. ఆదివారం పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. పలువురు సెలబ్రిటీలు ఆయనకు విష్ చేశారు. కీర్తి సురేశ్ కూడా విజయ్‌కి బర్త్ డే విషెస్ చెబుతూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది. అయితే త్రిష మాత్రం 'హ్యాపీ బర్త్ డే టూ బెస్టెస్ట్' అని క్యాప్షన్ పెట్టి, విజయ్ తన పెట్ డాగ్‌తో ఆడుతుండగా, తాను పక్కనే కూర్చుని ఉన్న ఫొటోని త్రిష పోస్ట్ చేసింది. దీంతో అభిమానులకు మరోసారి సందేహాలు మొదలయ్యాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

ఈ ఫొటో చూస్తే విజయ్.. త్రిష ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఇది ఇప్పటి ఫొటోనా? పాత ఫొటోనా అనేది క్లారిటీ లేదు. కానీ అభిమానులు మాత్రం వీళ్లు ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కెరీర్ విషయానికొస్తే.. విజయ్ 'జన నాయగణ్' మూవీ చేస్తున్నాడు. ఇదే ఇతడికి చివరిది. ఎందుకంటే ఇప్పటికీ రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనుంది.

త్రిష విషయానికొస్తే.. 40 ఏళ్లు దాటేసినా సరే పెళ్లి చేసుకోలేదు. గతంలో ఓసారి పెళ్లి వరకు వెళ్లింది గానీ ఎందుకో అది రద్దయిపోయింది. ఇక ఈమె పని అయిపోయింది అనుకునే టైంలో '96' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చింది. తర్వాత 'పొన్నియిన్ సెల్వన్' రెండు పార్ట్స్, లియో లాంటి క్రేజీ సినిమాలు చేసింది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో నటిస్తోంది.

(ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: నాగార్జున)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)