Breaking News

రూ.4.5 కోట్లు, రూ.75లక్షలు.. బాలీవుడ్‌ తారల వస్త్రధారణ ఖరీదు

Published on Sat, 05/03/2025 - 17:43

బాలీవుడ్‌ సినిమాలు అంటేనే రిచ్‌నెస్‌కి కేరాఫ్‌ అన్నట్టుగా ఉంటాయి. ప్రేక్షకుల్ని మెప్పించడానికి ఎన్ని వ్యయ ప్రయాసలకైనా సరే రెడీ అన్నట్టుగా  ఉండే బాలీవుడ్‌ నిర్మాతలు, కేవలం హీరో, హీరోయిన్ల దుస్తుల కోసం రూ.లక్షల నుంచి రూ.కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. గత కొంత కాలంగా పలు బాలీవుడ్‌ చిత్రాల్లో తారలు ధరించిన అత్యంత ఖరీదైన దుస్తుల వివరాలివే...

–షారూఖ్‌ ఖాన్‌ నటించిన వన్‌ సినిమాలో ఆయన ధరించిన రోబో పాత్రకు తగినట్టుగా రోబోటిక్‌ వస్త్రధారణలో కనిపిస్తారు. సినిమాలో ఈ గెటప్‌ చాలా కీలకం కావడంతో దీని కోసం రూ.4.5 కోట్లను నిర్మాతలు ఖర్చు పెట్టారట. ఇప్పటి దాకా అత్యధిక వ్యయం చేసిన కాస్ట్యూమ్‌ ఇదేనని చెప్పొచ్చు. ఈ కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌లో టాప్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రాతో పాటు విదేశీ డిజైనర్లు రాబర్ట్‌ లీవర్‌ వంటివాళ్లు కూడా పాలు పంచుకున్నారు.

–రాధా నాచేగీ అనే పాట కోసం నటి సోనాక్షి సిన్హా అత్యంత ఖరీదైన దుస్తులు ధరించిన ఘనత  దక్కించుకుంది. తేవార్‌  సినిమాలోని ఓ పాట కోసం రూపొందించిన డ్రెస్‌ విలువ ఏకంగా రూ.75లక్షలని సమాచారం.

–సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌లో హీరో అక్షయ్‌ కుమార్‌ ధరించిన టర్బాన్‌ పూర్తిగా స్వఛ్చమైన ప్లెయిన్‌ గోల్డ్‌తో తయారు చేశారు. దీని ఖరీదు రూ.65లక్షలు పైనే ఉంటుందట. టర్బాన్‌ ధరించడాన్ని బాలీవుడ్‌లో ట్రెండ్‌గా మార్చింది ఈ సినిమా.

–బాజీరావ్‌ మస్తానీ సినిమాలో చారిత్రక వస్త్ర వైభవాన్ని తెరపై ఆవిష్కరించడానికి డిజైనర్‌ అంజుమోన్‌  స్వయంగా చేతితో డిజైన్‌ చేయగా,  దీపిక పదుకునే ధరించిన దుస్తులకు రూ.50లక్షలకు పైనే ఖర్చు అయినట్టు తెలుస్తోంది. ఈ డ్రెస్‌ ఎంబ్రాయిడరీ వర్క్‌ మొత్తం అచ్చంగా బంగారంతో చేయడం  విశేషం.

–కంబక్త్‌ ఇష్క్‌ సినిమాలో కరీనా కపూర్‌ ధరించిన సెక్విన్‌ మినీ డ్రెస్‌ ను పారిస్‌ నుంచి తెప్పించారట. అందుకోసం రూ.8లక్షలు ఖర్చు పెట్టారు. టైటిల్‌ సాంగ్‌లో ఈ డ్రెస్‌ ధరించి మెరిసిన కరీనా..కొత్త ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ను సృష్టించింది.

–జోథా అక్బర్‌లో మొఘల్‌ దర్పాన్ని ఒలికించేలా హృతిక్‌ రోషన్‌ దుస్తుల్ని డిజైన్‌ చేయడం కోసం దాదాపుగా 18నెలల పాటు డిజైనర్‌ నీతాలుల్లా శ్రమించారు. అందులో ఒక కాస్ట్యూమ్‌ కోసం అత్యధికంగా రూ.12లక్షలు ఖర్చు పెట్టారు. ఇదే సినిమాలో ఐశ్వర్యారాయ్‌ అందంతో పాటు ఆమె వస్త్ర సోయగం కూడా ఇమిడిపోయేలా రూపొందిన ఐశ్వర్య దుస్తుల కోసం రూ.2లక్షలపైనే ఖర్చు చేశారు.

–మార్‌ డాలా అనే పాట దేవదాస్‌ సినిమాలో సూపర్‌హిట్‌. ఆ పాట లో జీవించిన బాలీవుడ్‌ స్టార్‌  మాధురీదీక్షిత్‌ ధరించిన రెడ్‌ కలర్‌ దుస్తులు కూడా అంతే హిట్‌. వీటి ఖరీదు రూ.15లక్షల పైమాటే.

–పద్మావతి సినిమా కోసం దీపిక పదుకునే ధరించిన లెహంగా ఏకంగా 30 కిలోల బరువు ఉంటుందట. పూర్తిగా కళాకృతులను ఇముడ్చుకున్న ఈ డ్రెస్‌... తయారీలో 200  మంది కళాకారులు పాలుపంచుకున్నారట. కిలోల కొద్దీ బంగారాన్ని వినియోగించిన ఈ దుస్తుల కోసం రూ.30లక్షలు ఖర్చు పెట్టారట.

–క్రిష్‌ 3 సినిమా లో కంగనా రనౌత్‌ ధరించిన దుస్తుల  ఖరీదు రూ. కోటి రూపాయలట.. పారిస్‌ నుంచి ఒక్కోటి రూ.10లక్షల ఖరీదు లాటెక్స్‌ సూట్స్‌  ను తెప్పించారు. అలాంటివి 10 సూట్స్‌ ఈ సినిమాలో ఆమె ధరించింది.

–చారిత్రక యుద్ధాల నేపధ్యంలో తీసిన వీర్‌ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ వారియర్‌గా చూపించే డ్రెస్‌ ఖరీదు రూ.20లక్షలు.  ఈ సినిమాలో యుద్ధవీరునిగా కనిపించే సమయంలో సల్మాన్‌  ధరించిన దుస్తుల్ని రాజస్థాన్‌కు చెందిన లెదర్‌ వర్క్‌ నిపుణులు తయారు చేశారు. ఒక్కోటి రూ.20లక్షల విలువైన అలాంటి 6 వారియర్‌ కాస్ట్యూమ్స్‌ను ఈ సినిమాలో సల్మాన్‌ ధరించాడు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)