నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!
Breaking News
ఖరీదైన కారు కొన్న టాలీవుడ్ బుల్లితెర జంట
Published on Tue, 06/30/2026 - 16:43
బుల్లితెర డాక్టర్‌బాబుగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు నిరుపమ్. కార్తీకదీపం సీరియల్‌తో ఫేమ్ తెచ్చకున్న నటుడు నిరుపమ్. తన సహనటి మంజులనే పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెర ప్రియులను అలరిస్తున్నారు. టాలీవుడ్‌లోని ఫేమ్ ఉన్న బుల్లితెర జంటల్లో వీరిద్దరు ముందుంటారు.
తాజాగా ఈ జంట ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రముఖ ఎంజీ బ్రాండ్‌కు చెందిన ఈవీ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. నా కొత్త కారు అంటూ అంటూ తన భర్తతో దిగిన ఫోటోలను నటి మంజుల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు బుల్లితెర జంటకు అభినందనలు చెబుతున్నారు. ఈ కారు విలువ దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.
కాగా.. చంద్రముఖి అనే సీరియల్ లో నిరుపమ్, మంజుల కలిసి నటించారు. అలా ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. నిరుపమ్.. కార్తీకదీపం సీరియల్ తో మూగమనసులు, అత్తారింటికి దారేది, రాధకు నీవే రా ప్రాణం సీరియల్స్ చేయగా.. మంజుల కూడా ఆకాశమంత, కృష్ణవేణి, ఇద్దరమ్మాయిలు, జానకి కలగనలేదు తదితర సీరియల్స్ లో యాక్ట్ చేసింది.
Tags : 1