సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ
Breaking News
మరో ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Published on Wed, 06/24/2026 - 18:44
తిరువీర్, రాశి, పాయల్ రాధాకృష్ణ కీలక పాత్రల్లో నటించిన చిత్రం పాపం ప్రతాప్. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి ఎస్పీ దుర్గా నరేశ్ దర్శకత్వం వహించారు.
తాజాగా ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేసింది. నేటి నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.
పాపం ప్రతాప్ కథేంటంటే..
ఈ సినిమా కథ 1994-98 మధ్య కాలంలో సాగుతుంది. ప్రతాప్ (తిరువీర్)కి బుజ్జమ్మ(పాయల్ రాధాకృష్ణ) అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. వయసుతో పాటు ఆమెపై ప్రేమ కూడా పెరుగుతుంది. ఓ రోజు బుజ్జమ్మనే ‘పెళ్లి చేసుకుందామా’ అని అడగడంతో..ప్రతాప్ వెంటనే ముహూర్తం పెట్టిస్తాడు. నాన్న రంగయ్య(అజయ్ ఘోష్)కి ఇష్టం లేకపోయినా.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటాడు. మొదటి మూడు రాత్రులు గడవగానే బుజ్జమ్మ పంచాయితీ పెడుతుంది. ప్రతాప్‌కి సమస్య ఉందని.. అతనితో సంసారం చేయలేనని ఊరిపెద్దలకు చెబుతుంది. ప్రతాప్‌కి ఉన్న సమస్య ఏంటని అడిగితే మాత్రం బయటకు చెప్పదు. అంతేకాదు తనలోని సమస్యేమిటో తనే తెలుసుకుని సరిదిద్దుకుంటేనే కాపురానికి వస్తానని చెప్పి..పుట్టింటికి వెళ్లిపోతుంది. అసలు ప్రతాప్‌కి ఉన్న సమస్య ఏంటి? ఆ సమస్యను కనుక్కునేందుకు ప్రతాప్ చేసిన ప్రయత్నాలు ఏంటి? సమస్య తెలుసుకున్నాక..దాన్ని సరిదిద్దుకున్నాడా లేదా? చివరకు బుజ్జమ్మ, ప్రతాప్ ఒక్కటయ్యారా లేదా ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Tags : 1