Breaking News

మూడు వారాల్లోనే ఓటీటీకి నాగబంధం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Thu, 07/23/2026 - 20:06

విరాట్ కర్ణ, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ నాగబంధం. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. అనంత పద్మనాభ స్వామి బ్యాక్‌డ్రాప్‌లో సోషియో ఫాంటసీ కథగా వచ్చిన ఈ సినిమా  గ్రాఫిక్స్ పరంగా అభిమానుల్ని ఆకట్టుకుంది. అయితే కంటెంట్ పరంగా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకరపోయింది. ఈ సినిమాలో ఫైట్స్‌తో పాటు కొన్ని సన్నివేశాలు అనవసర నిడివిని పెంచాయనే కామెంట్స్ కూడా వినిపించాయి.

అయితే జూలై 3న రిలీజైన ఈ మూవీ అప్పుడే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ చిత్రం జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు.  తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.  

అసలు ​‍కథేంటంటే..

ఈ సినిమా కథంతా 1756-1962 నేపథ్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ సాగుతుంది. ఇండియన్‌ ప్రముఖ ఆర్కియాలజిస్ట్‌ ప్రభాకర్‌(జగపతి బాబు) తన 30 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రహస్యాలను ఛేదించినా.. నాగబంధం రహస్యాన్ని మాత్రం కనిపెట్టలేకపోతాడు. దీనిపై తన శిష్యులు టెస్లా, అలీ(రిషబ్‌ సాహ్నీ) పరిశోధన చేస్తూ హిమాలయాలకు వెళ్తారు . అక్కడ ఎన్నో ఏళ్లుగా బంధించబడి ఉన్న బైరాగి(గరుడ రామ్‌) తన మంత్ర శక్తితో అలీ గతాన్ని గుర్తు చేసి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ప్రపంచాన్ని జయించాలంటే నాగ బంధాన్ని విడిపించాలని అందుకోసం బ్రహ్మ కమలం తీసుకురావాలని ఆలీని ఆదేశిస్తాడు. అలీ తన అనుచరులతో బ్రహ్మకమలం వెతుకుతూ.. అడ్డుకున్న వాళ్లను, దానికి సంబంధించిన వివరాలు తెలిసి చెప్పని వాళ్లను క్రూరంగా చంపుతుంటాడు. 

చివరకు ఆ బ్రహ్మకమలం శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉన్న స్వామివారి నాభిలో ఉండే పద్మంలో ఉందని తెలిసి.. ఓ ప్లాన్‌ ప్రకారం ఆలయం నుంచి బయటకు తీసుకురాగా.. ఓ కారణంగా అది భైరవకోన సమీపంలోని సముద్రంలో పడిపోతుంది. దాన్ని తీసుకొచ్చింది అలీ మనుషులు తులసీవనం గ్రామానికి వెళ్తారు. అక్కడ డబ్బు ఆశ చూపి రుద్ర(విరాట్‌ కర్ణ) సహాయంతో పడవలో భైరవకోనకు బయలుదేరుతారు. మరి ఆ స్వర్ణ కమలం అలీ మనుషులకు దొరికిందా లేదా? రుద్ర వాళ్లకు సహాయం చేశాడా లేదా? ఆ బ్రహ్మకమలానికి రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? అతను ప్రాణంగా ప్రేమించే చెల్లి మాసస(సోనియా సింగ్‌) చావుకు కారణం ఎవరు? పార్వతి(నభా నటేష్‌) ఎవరు? రుద్రతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? 1956లో ఏం జరిగింది? ముస్లిం రాజుతో కలిసి భైరాగి పన్నిన కుట్ర ఏంటి? అసలు నాగబంధం నేపథ్యం ఏంటి?చివరకు బైరాగి నాగబంధాన్ని విడిపించాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)