Breaking News

ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్!

Published on Wed, 01/15/2025 - 12:47

యాటిట్యూడ్ స్టార్‌గా పాపులర్ అయిన సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడైన చంద్రహాస్ తొలి సినిమానే 'రామ్ నగర్ బన్నీ'. ఈ చిత్రంలో విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించారు.  ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. గతేడాది అక్టోబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్, సలీమ్, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని కీలక పాత్రలు పోషించారు.

రామ్ నగర్ బన్నీ కథేంటంటే..?

రామ్‌నగర్ ఏరియాలో ఉండే బన్నీకి లేడీస్ వీక్‌నెస్. చూసిన ప్రతి అ‍మ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ప్రేమ కహానీ నడిపిస్తాడు. అమ్మాయిల వరకు అయితే ఏదో అనుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి మాటిస్తాడు. ఆమె కంపెనీలో చేరతాడు. అయితే ఈమెపై తనకు ఎలాంటి ఇష్టం లేదని, తను నిజంగా ప్రేమిస్తుందని శైలు(విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే ఆమెకు మరొకరితో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అవుతుంది. చివరకు బన్నీ, శైలు ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)