Breaking News

నా అనుకున్న వాళ్లకే ఇస్తా.. అందుకే చెప్తున్నా: హీరో రామ్‌

Published on Mon, 08/12/2024 - 07:38

రామ్ పోతినేని- పూరి జగన్నాధ్‌ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం డబుల్ ఇస్మార్ట్‌. ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ మూవీ రిలీజ్‌ తేదీ దగ్గర పడుతుండగా.. చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. హనుమకొండలోని జరిగిన ఈవెంట్‌కు చిత్ర యూనిట్ సభ్యులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో రామ్ అభిమానులను ఉద్దేశించి ఆసక్తకర కామెంట్స్‌ చేశారు. పక్కోడి గురించి.. పకోడీల గురించి పట్టింటచుకుంటే పనులు జరగవంటూ ఫ్యాన్స్‌కు అదిరిపోయే మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు.

 రామ్ మాట్లాడుతూ..'ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ.. బయటకానీ ఓ ట్రెండ్ చూస్తున్నా. అరే... నీకిది నచ్చిందా? అని అంటే... వాళ్లకు నచ్చుతుందేమో... వీళ్లకు నచ్చుతుందేమోనని పక్కనోళ్ల మీద తోసేస్తున్నారు.  ముందు మనకు నచ్చిందా? అనేది చూసుకోవాలి. మనం హోటల్‌కు వెళ్లి ఓ బిర్యానీ తిన్నామనుకోండి. బిర్యానీ బాగుందిరా అనుకోని.. చుట్టుపక్కల ఉన్న నలుగురు బాగలేదు అని అంటే మనమీద మనకు డౌట్‌ రాకూడదు. నేను తిన్నాను బాగుంది. అది బిర్యానీ అయినా, సినిమా అయినా.. రేపు మీ కెరీర్‌ అయినా..నీకు నచ్చింది నువ్వు చెయ్.. పక్కనోడి ఓపినియన్‌తో నీ అభిప్రాయం మార్చుకోవద్దు. ఎందుకంటే పక్కొడీ గురించి.. పకోడీల గురించి పట్టించుకుంటే ఇక్కడ పనులు జరగవు అన్నాయ్. మామూలుగా నేను సలహాలు ఇవ్వను. నా అనుకున్న వాళ్లకే ఇస్తా. మీరందరూ ఎందుకో నా మనుషులు ‍అనిపించింది. అందుకే చెప్తున్నా. థ్యాంక్‌ యూ సో మచ్ ఆల్‌. ఆగస్టు 15న కలుద్దాం. లవ్‌ యూ ఆల్‌' అంటూ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఎమోషనల్‌గా స్పీచ్ ఇచ్చారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌ ముంబయి ముద్దగుమ్మ కావ్య థాపర్‌ కనిపించనుంది. ఇందులో సంజయ్‌ దత్ బిగ్‌బుల్‌ పాత్రలో మెప్పించనున్నారు. ఈ చిత్రంలో కమెడియన్ అలీ కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)