Breaking News

'అలా జరగకపోతే నన్ను నమ్మకండి'.. నాని ఆసక్తికర కామెంట్స్

Published on Mon, 04/14/2025 - 18:49

నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న మోస్ట్ వయొలెంట్ యాక్షన్ థ్రిల్లర్ హిట్‌-3. ఈ సిరీస్‌లో శైలేశ్ కొలను డైరెక్షన్‌లో వస్తోన్న మూడో చిత్రం. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో ‍అర్జున్ సర్కార్‌ పాత్రలో నాని అభిమానులను మెప్పించనున్నారు. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్స్, టీజర్‌ చూస్తుంటే నాని గతంలో ఎన్నడు చూడని పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా హిట్-3 ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూశాక నాని వయొలెన్స్ ఓ రేంజ్‌లో ఉండనుందని అర్థమవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది. దీనికి హాజరైన హీరో నాని మీడియా ప్రతినిధులు ‍అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. గతంలో కోర్ట్ మూవీ హిట్‌ కాకపోతే హిట్‌-3 చూడొద్దని చెప్పారు కదా? మరీ ఈ సినిమాకు ఏం చెబుతారని నానిని ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందించారు.

(ఇది చదవండి: మోస్ట్ వైలెంట్‍గా 'హిట్‌-3' ట్రైలర్‌.. మార్కోను మించిపోయిన 'నాని')

నాని మాట్లాడుతూ..'ఈ సినిమాకు ఆ డైలాగ్ వాడితే నెక్ట్స్ సినిమాకు నేను నిర్మాతను కాదు. నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను.. వాళ్ల ఎవరినో ఎందుకు పెడతాను. హిట్-3 లాంటి జోనర్‌ లాంటి సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం మే 1న ఫుల్ మీల్స్ పక్కా. కొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. ఇది కనక తప్పని మీకు అనిపిస్తే నెక్ట్స్ టైమ్ నానిని నమ్మకండి' అంటూ సరదా నవ్వుతూ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
 

 

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు