Breaking News

భోగి వేడుక‍ల్లో మోహన్‌ బాబు కుటుంబం

Published on Mon, 01/13/2025 - 07:46

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇవాల్టి నుంచే భోగ భాగ్యాలు తీసుకొచ్చే భోగి పండుగ షురూ అయింది. నగరాలు బోసివేతున్న వేళ.. పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఈ పొంగల్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

తాజాగా సినీ  నటుడు మోహన్‌ బాబు సైతం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లాచంద్రగిరి మండలం రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్‌లో భోగి మంటలు వేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ భోగి వేడుకల్లో మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయాలకు, విలువలకు ప్రతీకే సంక్రాంతి పండుగని మోహన్ బాబు అన్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

భోగి వేడుకల్లో మోహన్ బాబు మాట్లాడుతూ..'సాంప్రదాయాలకు, విలువలకు ప్రతీక సంక్రాంతి. రైతు సుభిక్షంగా ఉంటేనే సంక్రాంతి వేడుకగా జరుపుకుంటా. సంతోషంగా జరుపుకునే ఈ పండుగ వేళ ముఖ్యంగా యువత జాగ్రత్త వహించాలి' అని అన్నారు. భోగి వేడుకల్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్త కన్నప్ప సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నామని తెలిపారు. జల్లికట్టుకు రంగంపేట ఫేమస్.. అందుకే యువత జాగ్రత్తగా ఉండాలని మంచి విష్ణు సూచించారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)