Breaking News

పవన్‌ కల్యాణ్‌కు బర్త్‌ డే విషెస్ చెప్పిన బన్నీ!

Published on Mon, 09/02/2024 - 11:30

టాలీవుడ్ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌.. ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్‌ కల్యాణ్‌కు బర్త్‌ డే విషెస్ తెలిపారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అయితే ఇటీవల చిరంజీవి బర్త్ డేను పురస్కరించుకుని బన్నీ విషెస్‌ తెలిపిన సంగతి తెలిసిందే.

అయితే కొద్ది రోజులుగా బన్నీ, మెగా ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల మారుతీనగర్‌ సుబ్రమణ్యం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బన్నీ చేసిన కామెంట్స్‌తో మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. తనకు నచ్చితే, తాను ఇష్టపడితే, అండగా నిల్చోవడానికి, ఎక్కడికైనా వెళ్లడానికి తాను వెనుకాడను అని చెప్పాడు. ఎప్పుడైతే 'చెప్పను బ్రదర్' అంటూ బన్నీ స్టేట్ మెంట్ ఇచ్చాడో అప్పట్నుంచి పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్‌ నడుస్తూనే ఉంది. తాజాగా బన్నీ.. పవన్‌ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతోనైనా ఈ ఫ్యాన్స్‌ వార్‌కు తెరపడుతుందేమో వేచి చూడాల్సిందే. 

బన్నీపై నోరు పారేసుకున్న జనసేన నేతలు..

బన్నీ చేసిన కామెంట్స్‌పై ఏపీకి చెందిన కొందరు జనసేన నేతలు నోరు పారేసుకున్నారు. నీ సినిమాలు ఏపీలో ఎలా ఆడతాయో చూస్తామంటూ బహిరంగంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో అది కాస్తా బన్నీ, మెగా ఫ్యాన్స్ ‍మధ్య సోషల్ మీడియా వార్‌కు దారితీసింది. దీంతో తనను నమ్మినవారి కోసం ఎ‍క్కడి వరకైనా వస్తానంటూ అల్లు అర్జున్‌ చేసిన కామెంట్స్‌ కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. 

ఫుష్ప-2 మూవీతో బిజీ..

ఇకపోతే.. ఐకాన్ స్టార్‌ ‍‍అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్‌ దాదాపు చివరిదశలో ఉంది. ఆగస్టులోనే రిలీజ్ కావాల్సిన చిత్రం.. నెల రోజుల షూటింగ్‌ పెండింగ్‌లో ఉండడంతో డిసెంబర్‌ 6వ తేదీకి వాయిదా వేశారు. 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)