Breaking News

రణ్‌బీర్ కపూర్ రామాయణ.. టాలీవుడ్ హీరో రివ్యూ

Published on Sun, 11/08/2026 - 05:20

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా వచ్చిన మూవీ రామాయణ. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.  ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు. రిలీజైన మొదటి రోజు నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంపై టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి, హీరో మహేశ్ బాబు తమ రివ్యూలు ప్రకటించారు. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ కొనియాడారు.

తాజాగా మరో టాలీవుడ్ హీరో రామాయణపై రివ్యూ ప్రకటించారు. హీరో ఆది సాయి కుమార్ రామాయణపై ప్రశంసలు కురిపించారు. రామాయణ మూవీ ఎంత అద్భుతమైన సినిమా అని కొనియాడారు.  రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ అందరూ తమ పాత్రలను ఎంతో అందంగా పోషించారని అన్నారు. చిన్నప్పుడు మనం వింటూ పెరిగిన ఇతిహాసాన్ని, నేటి తరానికి తగినట్లుగా ఒక గొప్ప, ప్రపంచ స్థాయి రూపంలో మళ్లీ చూస్తున్నట్లు అనిపించిందని రాసుకొచ్చారు. 

అద్భుతమైన దృశ్యాల నుంచి నేపథ్య సంగీతం వరకు.. ప్రతీదీ అత్యున్నత స్థాయిలో ఉందన్నారు. ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చిందన్నారు. వెండితెరపై తప్పక చూడవలసిన చిత్రం. మీ కుటుంబం, పిల్లలతో కలిసి ఈ ఇతిహాసాన్ని అస్సలు మిస్ అవ్వకండని సూచించారు. ఈ అనుభవాన్ని వారు చిరస్మరణీయంగా గుర్తుంచుకుంటారని.. భారతీయ సినిమా తన అత్యున్నత స్థాయిలో రామాయణ మూవీని తెరకెక్కించారని ఆది సాయికుమార్ ‍అభినందించారు. 
 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)