బిజినెస్ మ్యాన్ తో పెళ్లైంది... నలుగురు పిల్లలు ఉన్నారు
Breaking News
పెద్ది ఐటమ్ సాంగ్.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌కు ఛాన్స్.!
Published on Wed, 04/08/2026 - 15:43
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీని రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్‌లో ఈ స్టోరీ ఉండనుంది. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ రెజ్లర్ లుక్ హైలెట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 30న పెద్ది థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ కూడా ఉండనుంది. ఈ పాటకు ఇప్పటికే మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

తాజాగా టాలీవుడ్‌లో మరో యంగ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీలో హిట్ కొట్టిన మానస వారణాసిని ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. యంగ్ హీరోయిన్ అయితే ఈ పాట మరింత హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సాంగ్ చేసేందుకు మృణాల్ ఠాకూర్ నో చెప్పినట్లు సమాచారం. అయితే మానస వారణాసి ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతకుముందు మానస వారణాసి మహేశ్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
Tags : 1