Breaking News

ఓటీటీలో తండేల్‌.. ఏడిపించేస్తున్న బుజ్జితల్లి వీడియో సాంగ్‌

Published on Fri, 03/07/2025 - 13:25

తండేల్‌ సినిమా (Thandel Movie)తో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. ప్రేమకథలతో హిట్లు అందుకోవడం చైకి కొత్తేమీ కాదు. కానీ సెంచరీ కొట్టడం మాత్రం ఇదే తొలిసారి. చందూ మొండేటి దర్శకత్వం వహించగా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ నిర్మించారు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన తండేల్‌ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్‌ కొల్లగొట్టేసిన ఈ మూవీ సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వచ్చేసింది. నేడు (మార్చి 7) తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

బుజ్జి తల్లి సాడ్‌ వర్షన్‌
ఇటీవల బుజ్జితల్లి వీడియోసాంగ్‌ను రిలీజ్‌ చేసిన చిత్రబృందం నేడు బుజ్జితల్లి సాడ్‌ వర్షన్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు.  సినిమాలో ఈ సాంగ్‌ వచ్చేటప్పుడు ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటారు. ఏమి తప్పు చేశానే.. ఇంత శిక్ష వేశావె.. ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావె.. అంటూ సాగే ఈ పాట బ్రేకప్‌ అయిన వారికి మరింత కనెక్ట్‌ అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటను జావెద్‌ అలీ అద్భుతంగా పాడారు. శ్రీ మణి గుండెల్ని మెలిపెట్టే లిరిక్స్‌ రాశారు.

 

చదవండి: నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు