Breaking News

'జన నాయగణ్'.. విజయ్ పాడిన మరో పాట రిలీజ్

Published on Fri, 12/26/2025 - 18:00

తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రెండు పాటలు రాగా తాజాగా మూడో పాటని విడుదల చేశారు. 'చెల్ల మగళే' అంటూ సాగే ఈ క్యూట్ గీతాన్ని విజయ్ పాడటం విశేషం. 'దళపతి కచేరీ' అంటూ సాగిన తొలి పాటలోని ఓ పోర్షన్‌ని విజయ్ గాత్రమందించాడు. ఈ పాట మాత్రం మొత్తంగా విజయ్ ఆలపించాడు.

(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్‌' ఇమ్మాన్యుయేల్)

ఈ సినిమా.. తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ పాట చూస్తే అదే అనిపించింది. ఒరిజినల్ మూవీలోనూ హీరో బాలకృష్ణ-పాప శ్రీలీల మధ్య ఓ సాంగ్ ఉంటుంది. అది ఇది ఒకటేలా అనిపిస్తున్నాయి. తెలుగులోనూ ఈ మూవీ 'జన నాయకుడు' పేరుతో విడుదల చేస్తున్నారు.

విజయ్‌.. తనకు ఇది చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించాడు. వచ్చే ఏడాది వేసవిలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో ఇతడి పార్టీ పోటీపడనుంది. అందులో విజయ్ ఏ మేరకు విజయాన్ని అందుకుంటాడో చూడాలి? ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించింది. మమిత బైజు కూడా కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. అనిరుధ్ సంగీతమందించాడు.

(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)