Breaking News

తెలుగు సీరియల్ నటికి అసభ్య వీడియోలు.. వ్యక్తి అరెస్ట్

Published on Tue, 11/04/2025 - 12:06

తెలుగు, కన్నడ భాషల్లో సీరియల్స్ చేస్తున్న ఓ నటి.. నెలలుగా ఇబ్బంది పడుతోంది. ఇక తట్టుకోలేక ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దీంతో ఈ నటిని వేధిస్తున్న వ్యక్తిని బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది.

(ఇదీ చదవండి: భరణితో ట్రోల్స్‌.. ఫైర్‌ అయిన మాధురి)

ఏం జరిగింది?
స్వతహాగా బెంగళూరుకి చెందిన ఓ నటి.. కన్నడతోపాటు తెలుగులోనూ సీరియల్స్ చేస్తోంది. ఈమెకు ఓ రోజు నవీన్ అనే వ్యక్తి నుంచి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. కానీ ఈమె దీన్ని తిరస్కరించింది. పలుమార్లు ఇలానే చేసింది. దీంతో కక్ష పెంచుకున్న ఇతడు.. అభ్యంతరకర వీడియోలు పంపించడం మొదలుపెట్టాడు. బ్లాక్ చేయడంతో పలు ఫేక్ అకౌంట్స్ సృష్టించి మరీ సదరు నటికి మెసేజులు, వీడియోలు పంపిస్తూనే ఉ‍న్నాడు.

దాదాపు మూడు నెలల పాటు నవీన్ వల్ల మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్న సదరు నటి.. ఇక తట్టుకోలేక వ్యక్తిగతంగా అతడిని కలిసి సమస్యని పరిష్కరించుకోవాలని అనుకుంది. ఈ క్రమంలోనే నాగభైరవి ప్రాంతంలోని నందన్ ప్యాలెస్‌లో నవీన్‌ని కలిసింది. ఇవన్నీ ఆపేయాలని కోరింది. అయినా సరే అతడిలో మార్పు రాకపోవడంతో పోలీసులని ఆశ్రయించింది. దీంతో నటి ఫిర్యాదు మేరకు నవీన్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు సాగుతోంది.

(ఇదీ చదవండి: ఈ జనరేషన్ ఆడపిల్లల మనసు ఆవిష్కరించిన సినిమా.. ఓటీటీ రివ్యూ)

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి