Breaking News

బాక్సాఫీస్‌ దుమ్ము దులిపిన తేజ.. తొలిరోజు ఎన్నికోట్లంటే?

Published on Sat, 09/13/2025 - 11:23

ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లో గ్రాఫిక్స్‌ ఉపయోగిస్తున్నారు. ఈ వీఎఫ్‌ఎక్స్‌ కోసం వందల కోట్లు గుమ్మరించేస్తున్నారు. దాంతో బడ్జెట్‌ తడిసిమోపెడవుతోంది. దానికి తగ్గట్లుగా కలెక్షన్స్‌ రాబట్టడం గగనమవుతోంది. కానీ మిరాయ్‌ (Mirai Movie) మాత్రం తక్కువ బడ్జెట్‌తోనే అద్భుతాలు సృష్టించింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ మిరాయ్‌. హీరోయిన్‌గా రితికా నాయక్‌, విలన్‌గా మంచు మనోజ్‌, హీరో తల్లిగా శ్రియ నటించారు. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు.

ఫస్ట్‌డే కలెక్షన్స్‌
సెప్టెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. తొలిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్లకుపైగా కలెక్షన్స్‌ వసూలు చేసింది. ఇది హనుమాన్‌ కంటే కూడా ఎక్కువని తెలుస్తోంది! తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్‌ మూవీ మొదటిరోజు రూ.25 కోట్ల లోపే వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ రికార్డును మిరాయ్‌ బద్ధలు కొట్టింది. మిరాయ్‌ మూవీ నార్త్‌ అమెరికాలో 7 లక్షల డాలర్లు (రూ.6 కోట్లపైనే) వసూలు చేసినట్లు చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. తేజ సజ్జ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ తీసుకొచ్చిన చిత్రంగా మిరాయ్‌ నిలిచింది. వీకెండ్‌లో ఈ కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.

 

 

 

 

 

చదవండి: ఇమ్మాన్యుయేల్‌పై మాస్క్‌ మ్యాన్‌ దారుణ కామెంట్స్‌.. బాడీ షేమింగ్‌

Videos

విశాఖలో టైమ్ పాస్ చేస్తున్న టీడీపీ MLA

చురాచాంద్ పూర్ సభలో ప్రధాని మోదీ శాంతి సందేశం

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ప్రత్యేక బస్సులో విజయ్ తమిళనాడు రాష్ట్ర పర్యటన

Byreddy: మీ యాక్షన్ కు మా రియాక్షన్... మీ ఊహకే వదిలేస్తున్నా

Renu Agarwal Case: హంతకులు ఎలా దొరికారంటే..?

Renu Agarwal Case: హంతకులు ఎలా దొరికారంటే..?

Team India: వాళ్ళు లేక విల విల! అది రో-కో రేంజ్

Global War: బాబా వంగా చెప్పిన ఈ 3 నిజమైతే ప్రళయమే!

Penna River: ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూ నది, పెన్నా నది

Photos

+5

బిగ్‌బాస్‌ ఫేమ్‌ మెరీనా-రోహిత్‌ కూతురి ఫస్ట్‌ ఫోటోషూట్‌ (ఫోటోలు)

+5

‘మిరాయ్‌’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

వింటేజ్ లుక్స్ లో ఫరియా అబ్దుల్లా నెట్టింట ఫొటోలు వైరల్

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)