Breaking News

యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Published on Mon, 04/14/2025 - 13:02

గత రెండు రోజుల నుంచి తమిళ యంగ్ హీరో శ్రీ గురించి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమాలు చేస్తున్నప్పుడు అందంగా కనిపించిన ఈ కుర్రాడు.. ఇప్పుడు ఎముకల గూడులా తయారయ్యాడు. జుత్తుకు రంగేసుకుని అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. 

లోకేశ్ కనగరాజ్ తొలి మూవీ 'మానగరం'లో ఓ హీరోగా నటించిన శ్రీ.. అంతకు ముందు అంటే 2012 నుంచే ఇండస్ట్రీలో ఉన్నాడు. కాకపోతే చివరగా 'ఇరుగుపట్రు' ‍అనే చిత్రంలో నటించాడు. అయితే ఈ సినిమా నిర్మాతలు శ్రీకి రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశారని, దీంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఢిల్లీ పారిపోయాడని అంటున్నారు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)

ఇన్ స్టాలో యాక్టివ్ గానే ఉన్న శ్రీ.. ఎప్పటికప్పుడు తన ఫొటోలని పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఇతడిని చూసిన తమిళ ప్రేక్షకులు షాకవుతున్నారు. ఎందుకంటే అంత దారుణ పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. తాజాగా ఇతడి గురించి తమిళ ప్రముఖ నిర్మాత ఎస్ఆర్ ప్రభు ట్వీట్ చేశారు.

'శ్రీ ఆరోగ్యం కోసం మేం ఆందోళన పడుతున్నాయి. అతడి కుటుంబ సభ్యులతో పాటు మేం కూడా చాలారోజుల నుంచి అతడిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయం చుట్టూ చాలా ఊహాగానాలు ఏర్పడటం దురదృష్టకరం. శ్రీని మళ్లీ మామూలు మనిషిని చేయడమే మా తొలి ప్రాధాన్యం. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాలని నమ్మొద్దు' అని నిర్మాత ఎస్ఆర్ ప్రభు రాసుకొచ్చారు.

(ఇదీ చదవండి: మోస్ట్ వైలెంట్‍గా 'హిట్‌-3' ట్రైలర్‌)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)