Breaking News

న్యూ ఇయర్‌ వేడుకల్లో మిల్కీ బ్యూటీ.. అతనితో డేటింగ్‌ నిజమేనా?

Published on Mon, 01/02/2023 - 16:36

హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో అగ్ర హీరోలందరితో నటించింది భామ. శ్రీ మూవీతో తెలుగు తెరపై మెరిసిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల గుర్తుందా శీతాకాలం మూవీతో అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తోంది. తమన్నా తెలుగులో చిరంజీవి భోళా శంకర్‌ మూవీలోనూ నటిస్తోంది. తాజాగా న్యూ ఇయర్‌ వేడుకల్లో సందడి చేసింది ముద్దుగుమ్మ. గోవాలో ఎంజాయ్‌ చేస్తూ కనిపించింది. 

(ఇది చదవండి: రొమాంటిక్‌ సీన్స్‌లో హీరోల ప్రవర్తన అలా ఉంటుంది: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు)

న్యూ ఇయర్ పార్టీలో తమన్నా భాటియా, మరో నటుడు విజయ్ వర్మను ముద్దు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. ఈ సీన్ చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో నటులు విజయ్ వర్మ,  తమన్నా భాటియా ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్నారు. తమన్నా భాటియా కొత్త ఏడాదిలో తమ రిలేషన్‌ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విజయ్, తమన్నా తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోలేదు.

కొత్త జంట రిలేషన్‌షిప్‌ను చూసిన కొంతమంది అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. తమన్నాతో విజయ్ వర్మ డేటింగ్ చేస్తున్నాడా'  ఓ నెటిజన్ ప్రశ్నించారు.  మరికొందరేమో విజయ్‌ 'లక్కీ' పర్సన్ అంటూ కామెంట్ చేశారు.  తమన్నా చంద్ సా రోషన్ చెహ్రా (2005)తో సమీర్ అఫ్తాబ్ సరసన నటించింది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో నటిస్తోంది. రాజమౌళి బాహుబలి, ఘని, ఎఫ్3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, బాబ్లీ బౌన్సర్, ప్లాన్ ఎ ప్లాన్ బి, గుర్తుందా సీతాకాలం లాంటి చిత్రాల్లో కనిపించింది.  నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన బోలే చుడియాన్‌లో తమన్నా నటించనుంది.

(ఇది చదవండి: వ్యాపారవేత్తతో పెళ్లి.. తమన్నా క్లారిటీ)

కాగా.. విజయ్, 2012లో చిట్టగాంగ్‌ చిత్రంతో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. పింక్, మాన్‌సూన్ షూటౌట్, మాంటో, గల్లీ బాయ్, ఘోస్ట్ స్టోరీస్ ఆంథాలజీ చిత్రాలకు కూడా అతను పేరు తెచ్చుకున్నాడు. 2022లో హర్దాంగ్, డార్లింగ్స్ చిత్రాలలో కనిపించాడు.  విజయ్ తన తదుపరి చిత్రం కరీనా కపూర్, జైదీప్ అహ్లావత్‌లతో కలిసి సుజోయ్ ఘోష్ నిర్మిస్తున్న  ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్‌లో నటించనున్నారు.

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)