Breaking News

ఇబ్బందిగా ఉందని చెబితే.. సౌత్‌ స్టార్‌ హీరో నాపై కేకలు వేశాడు : తమన్నా

Published on Thu, 08/07/2025 - 11:28

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్‌ హీరోయిన్లుగా కొనసాగుతున్న చాలామంది కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నవాళ్లే. అవమానాలను భరించి, అవకాశం వచ్చినప్పుడు తమ టాలెంట్‌ని నిరూపించుకున్నవాళ్లే ఇప్పుడు స్టార్స్‌గా కొనసాగుతున్నారు. అలాంటి వారిలో తమన్నా(Tamanna Bhatia ) కూడా ఒకరు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ మిల్కీ బ్యూటీ.. కెరీర్‌ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిదట. చాలామంది తనను అవమానించి, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలినాళ్లలో తనకు ఎదురైన ఓ సంఘటన గురించి చెప్పింది. తనకు అసౌకర్యంగా ఉందని చెప్పినందుకు ఓ స్టార్‌ హీరో కేకలు వేసి.. తన స్థానంలో మరో నటిని తీసుకోవాలని ఆదేశించారట.

(చదవండి: విడాకుల బాటలో మరో సీనియర్‌ హీరోయిన్‌!)

‘చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చాను కాబట్టి నాకేమి తెలియదని చాలా మంది అనుకున్నారు. నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. చాలాసార్లు నన్ను అవమానించేందుకు ప్రయత్నంచారు. కెరీర్‌ ప్రారంభంలో సౌత్‌కి చెందిన ఓ పెద్ద హీరోకి జోడిగా నటించే అవకాశం వచ్చింది. ఆయనతో కొన్ని సీన్లలో నటించాల్సి వచ్చినప్పుడు నాకు కాస్త అసౌకర్యంగా అనిపించింది. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలకు చెప్పి.. నాకు ఇబ్బందిగా ఉంది చేయలేనన్నాను. వెంటనే ఆ స్టార్‌ వచ్చి నాపై కేకలు వేశాను. దర్శక నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘హీరోయిన్‌ని మార్చేయండి’ అన్నారు. అప్పుడు నేను కాస్త బాధ పడ్డాను కానీ తిరిగి ఆ హీరోని ఏమి అనలేదు. మౌనంగా ఉండిపోయాను. మరుసటి రోజు ఆ స్టార్‌ హీరోనే నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. కోపంలో అలా అరిచానని, అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్తాపపడ్డాడు’ అని తమన్నా చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో పేరు చెప్పడానికి మాత్రం నిరాకరించింది.

(చదవండి: 40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న నటి.. 'మగవాడ్ని ఇలాంటి ప్రశ్నలు అడగ్గలరా?')

తమన్నా సీనీ కెరీర్‌ విషయానికొస్తే.. 2005లో ‘చాంద్‌ సా రోష్‌ చెహ్రా’ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మంచు మనోజ్‌ శ్రీ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. హ్యాపీడేస్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. చిరంజీవి, వెంకటేశ్‌ లాంటి సీనియర్‌ హీరోలతో పాటు మహేశ్‌ బాబు, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ లాంటి స్టార్‌ హీరోలతోనూ సినిమాలు చేసింది. ఆ మధ్య ఓదెల 2 మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం నాలుగు హిందీ సినిమాల్లో నటిస్తున్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)