Breaking News

'బిగ్ బాస్'తో బలుపు పెరిగింది.. నా ఫ్రెండ్సే నన్ను..: సొహెల్

Published on Fri, 05/16/2025 - 17:48

బిగ్ బాస్.. ఓ రియాలిటీ షో మాత్రమే. గత కొన్ని సీజన్లపై దారుణమైన విమర్శలు వచ్చాయి. వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏడో సీజన్ విజేతగా నిలిచిన రైతుబిడ్డ అని చెప్పుకొనే పల్లవి ప్రశాంత్ వల్ల షోకి చాలా చెడ్డ పేరు వచ్చింది. దీనంతటికీ కూడా సదరు కంటెస్టెంట్స్ కి ఉండే బలుపే కారణం. ఇదేదో మేం చెబుతున్న మాట కాదు. స్వయనా సొహెల్ చెప్పాడు. ఈ షో వల్ల తనకు ఎంత మైనస్ అయిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) 

'బిగ్ బాస్ తర్వాత నాకు చాలా మైనస్ అయింది. ప్లస్ కూడా అయింది. ముఖ్యంగా మైనస్ గురించి చెప్పుకొంటే.. ఆ టైంలో నాకు విపరీతంగా బలుపు పెరిగింది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. అస్సలు కంట్రోల్ లో లేను. కొన్ని మాటలు నోరు జారాను. నా ఫ్రెండ్సే.. నన్ను అలా మాట్లాడేలా చేశారు. ఏందన్నా నువ్వు కానియ్ అనేవారు. అప్పట్లో నా ముందు ఎవరైనా మైక్ పెడితే నోటికొచ్చింది మాట్లాడేవాడిని. కప్పుది ఏముంది చేయించుకుందాం లాంటి అతి మాటలు మాట్లాడేవాడిని. దీనంతటికీ పక్క వాళ్ల ప్రభావమే కారణం'

'జీరోగా బిగ్ బాస్ షోకి వెళ్లాను. బయటకు వచ్చిన తర్వాత క్రేజ్ చూసేసరికి బలుపు పెరిగిపోయింది. కానీ నేను కావాలని నోరు జారలేదు. 'లక్కీ లక్ష‍్మణ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా.. 'నా కొడకల్లారా ఇంటికి వచ్చి కొడతా' అని వార్నింగ్స్ ఇవ్వడం చేశా. ఇప్పుడు ఆ బలుపు మొత్తం తగ్గిపోయింది. సమయం రావాలంతే. అదే మొత్తం సెట్ చేస్తుంది. నాకు ఇప్పుడు టైమ్ వచ్చింది'

(ఇదీ చదవండి: శవంతో కామెడీ.. క్రేజీ డార్క్ కామెడీ మూవీ రివ్యూ (ఓటీటీ)) 

'చాలామంది బిగ్ బాస్ షోని తిట్టుకుంటారు కానీ.. అది నాకు చాలా నేర్పించింది. అక్కడ రియల్ గానే ఉన్నాను. బిగ్ బాస్ సీజన్ 4 బెస్ట్ అంటారు. గెలవాలనే తపన అక్కడ నేర్చుకున్నాను. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ మా సీజన్ మాత్రం విలువలతో కూడిన సీజన్' అని సొహెల్ చెప్పుకొచ్చాడు.

సొహెల్ మాటల బట్టి చూస్తే అతడు చెప్పింది అక్షరాలా నిజమేననిపిస్తుంది. ఎందుకంటే తొలి సీజన్ నుంచి ఇప్పటివరకు గెలిచిన ఎవరూ కూడా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. పైపెచ్చు పూర్తిగా కనుమరుగైపోయారు కూడా. ఇకపై వచ్చే సీజన్లలో పాల్గొనే కంటెస్టెంట్స్ సొహెల్ మాటలు ఓసారి వింటే బెటర్ ఏమో?

(ఇదీ చదవండి: ‍'రామాయణ్'లో కాజల్ అగర్వాల్.. అలాంటి పాత్రలోనా?) 

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)