ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...
షార్ట్ ఫిల్మ్‌తో ఎంట్రీ.. ఇప్పుడేమో వరుస ఆఫర్లు.. ఎవరీమె?
Published on Wed, 03/25/2026 - 18:47
సినీరంగంలోకి దూసుకెళ్తన్నారు ప్రముఖ నటి ద్రిషికా చందర్. న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో చదువుకున్న ఆమె నటిగా మంచి మార్కులు కొట్టేశారు. అంతేకాదు.. సమర్థవంతమైన వక్తగా కూడా రాణిస్తున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ద్రిషికా.. తక్కువ కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించడం మరో విశేషం.
ద్రిషికా చందర్ తెలుగు భాషలో 'మనసానమః' షార్ట్ ఫిల్మ్ ద్వారా తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. 2022లో ఆస్కార్ అర్హత పొందిన ఈ చిత్రంలోని ఆమె నటనకు అంతర్జాతీయ స్థాయిలో నలభైకి పైగా 'ఉత్తమ నటి అవార్డులు' పొందారు. అంతేకాదు మనసానమః చిత్రం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా అవార్డులు కైవసం చేసుకోవడం విశేషం. తెలుగులో 'బుచ్చి నాయుడు కండ్రిగ', 'ఎ బ్యూటిఫుల్ గర్ల్' తదితర చిత్రాలతో సినీ ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆమె నటించిన 'సుయోధన' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇప్పటికే తెలుగులో నాలుగు, హిందీలో రెండు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. అంతేకాకుండా మలయాళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు. ఇటీవలే జియో సినిమాలో రిలీజైన హిందీ మూవీ 'హే కమీనీ'లో ఆమె నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ద్రిషికా నటిస్తోన్న మరిన్ని మలయాళ, తెలుగు భాషా చిత్రాలు నిర్మాణానంతర పనుల్లో ఉన్నాయి.
ఆమె వెండి తెరపైనే కాకుండా నాటక రంగంలోనూ ఆమెకు ప్రవేశం ఉంది. 'ఏవం ఇంద్రజిత్' అనే హిందీ నాటికలో ఆరు విభిన్న కోణాలున్న మహిళా పాత్రను పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు భాషలపై మంచి పట్టున్న ద్రిషికా చందర్.. రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయారు.
Tags : 1