Breaking News

Sushant Singh: ఆ నవ్వులు చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి

Published on Mon, 06/14/2021 - 16:57

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి నేటికి ఏడాది. ఈ సందర్భంగా అతడి మాజీ ప్రేయసి, నటి అంకిత లోఖండే పదేళ్ల క్రితం సుశాంత్‌తో కలిసి దీపావళి వేడుకల్లో డ్యాన్స్‌ చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 'ఇది 2011 దీపావళి నాటి వీడియో. నీ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి సుశాంత్‌.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం' అని రాసుకొచ్చింది. ఇందులో బ్లాక్‌ డ్రెస్‌ ధరించిన సుశాంత్‌ చిరునవ్వులు చిందిస్తూ అంకితతో స్టెప్పులేశాడు. ఆయన చిరుదరహాసాన్ని చూస్తుంటే అభిమానుల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

కాగా సుశాంత్‌ గతేడాది జూన్‌ 14న బాంద్రాలోని తన నివాసంలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఎంతో భవిష్యత్తున్న టాలెంటెడ్‌ నటుడు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడమేంటని అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇది ఆత్మహత్య కాదని, బాలీవుడ్‌ మాఫియా చేయించిన హత్య అని ఆరోపించారు. సుశాంత్‌ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో సీబీఐ విచారణ కూడా జరుపుతోంది. సుశాంత్‌ ఈ లోకాన్ని విడిచి పెట్టి సంవత్సరం పూర్తైనా అభిమానుల గుండెల్లో మాత్రం ఇప్పటికీ కొలువై ఉన్నాడు.

ఇదిలా వుంటే పవిత్ర రిష్తా సీరియల్‌ షూటింగ్‌ సమయంలో అంకిత, సుశాంత్‌ సింగ్‌ల మధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఆరేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2016లో విడిపోయారు. ఆ తర్వాత సుశాంత్,‌ రియా చక్రవర్తిని లవ్‌ చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: నేను సారా అలి ఖాన్‌ కలిసి గంజాయ్‌ పీల్చాం: రియా

Videos

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో బిగ్ అప్‌డేట్

జోహార్ చంద్రబాబు.. జోహార్ లోకేష్.. గంటా కొడుకు అత్యుత్సాహం

బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం

పసి మనసులను చంపేస్తోన్న వివాహేతర సంబంధాలు

ఎల్లో మీడియా వేషాలు

కడప టీడీపీ నేతలకు బాబు మొండిచెయ్యి

ఎల్లో మీడియాకు మద్యం కిక్కు తగ్గేలా లేదు..

Analyst Vijay babu: వాళ్లకు ఇచ్చిపడేశాడు హ్యాట్సాఫ్ నారాయణ..

Photos

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)