Breaking News

ఓటీటీలోకి 'సూపర్ మ్యాన్' లేటెస్ట్ సినిమా

Published on Wed, 08/13/2025 - 12:41

ఇప్పుడంటే కాస్త తగ్గిపోయాయి గానీ అప్పట్లో హాలీవుడ్‌లో సూపర్ హీరో జానర్‌లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. ప్రత్యేకించి 'సూపర్ మ్యాన్' ఫ్రాంచైజీ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 1984 నుంచి ఈ మూవీస్ వస్తూనే ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ నుంచి రిలీజైన లేటెస్ట్ మూవీ ఇప్పుడు నెల అయ్యేసరికి ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఎందులో స్ట్రీమింగ్ కానుంది? ఈ మూవీ సంగతేంటి?

డీసీ యూనివర్స్‌లోని లేటెస్ట్ 'సూపర్ మ్యాన్' సినిమా జూలై 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే మరీ సూపర్ అనిపించేలా టాక్ తెచ్చుకోలేకపోయింది. మన దేశంలోనూ ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డైరెక్టర్ జేమ్స్ గన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, ఫాండంగో ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఏలియన్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

'సూపర్ మ్యాన్' విషయానికొస్తే.. జహ్రాన్‪‌పూర్‌పై బొరేవియా తన సైన్యంతో దాడి చేయగా.. దాన్ని సూపర్ మ్యాన్ అడ్డుకుంటాడు. అయితే టెక్నాలజీతో ప్రయోగాలు చేసే లెక్స్ లూథర్.. సూపర్ మ్యాన్‌పై వ్యతిరేకత వచ్చేలా అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కొన్ని మాయమాటలు చెబుతాడు. వీడియోలు చూపిస్తాడు. దీంతో సూపర్ మ్యాన్‍‌పై అందరికీ నమ్మకం పోతుంది. మరి అలాంటి పరిస్థితి నుంచి అందరూ తనని నమ్మేలా ఎలా చేశాడు? ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.

సూపర్ మ్యాన్‌తో పాటు ఈ వారం 30కి పైగా సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ, గ్యాంబ్లర్స్, టెహ్రాన్ చిత్రాలతో పాటు సారే జహాసే అచ్చా, అంధేరా లాంటి సిరీసులు కూడా ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. వీటితోపాటే ఏమైనా సడన్ సర్‌ప్రైజ్ స్ట్రీమింగ్‌లు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)