Breaking News

భార్యని పట్టుకుని పిల్లాడిలా ఏడ్చేసిన సుమన్ శెట్టి

Published on Tue, 11/18/2025 - 15:47

బిగ్‌బాస్ షోలో ఫ్యామిలీ వీక్ కోసం ప్రతిఒక్కరూ ఎదురుచూస్తారు. ఎందుకంటే మిగతా రోజులు ఎంత గొడపడ్డా సరే 'ఫ్యామిలీ వీక్' వచ్చేసరికి హౌస్‌మేట్స్ అందరూ ఒక్కటవుతారు. చూస్తున్నంతసేపు నిజమైన ఎమోషన్స్ బయటకొస్తాయి. అందుకే ప్రేక్షకులు కూడా ప్రతి సీజన్‌లోనూ దీనికోసమే ఎదురుచూస్తుంటారు. ఈసారి 9వ సీజన్‌లో మొదలైపోయింది. ఇప్పటికే తనూజ కుటుంబ సభ్యులు రాగా.. సుమన్ శెట్టి భార్య కూడా హౌస్‌లోకి వచ్చింది. ఈ ప్రోమో చాలా బాగుంది.

తొలుత సుమన్ శెట్టిని కన్ఫెషన్ గదికి పిలిచిన బిగ్‌బాస్.. మీరు పొందిన టైమ్ కార్డ్ ద్వారా మీ కుటుంబ సభ్యునితో 20 నిమిషాలు మాత్రమే గడపగలరు అని చెప్పారు. మరీ ఇంత తక్కువ సమయమేనా అని సుమన్ బాధపడ్డాడు గానీ గార్డెన్ ఏరియాలో ఉన్న తన భార్యని చూసి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. బుగ్గపై ముద్దుపెట్టి మరీ ఎలా ఉన్నావ్ అని క్యూట్‌గా అడిగాడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి పూజ.. కుంకుమ పెట్టి ఏడ్చేసిన 'తనూజ')

అలానే అమ్మ ఆరోగ్యం ఎలా ఉందని సుమన్ చాలా బెంగపడుతూ భార్యని అడిగాడు. బాగానే ఉన్నారని చెప్పడంతో.. గౌతమ్ రాలేదేమీ అంటూ తన బిడ్డ గురించి సుమన్ అడిగాడు. ఒక్కరికే పర్మిషన్ ఇచ్చారని చెప్పడంతో ఊరుకున్నాడు. బాగా ఆడుతున్నానా అని తన ఆట గురించి భార్యని స్వీటుగా అడిగాడు. చాలా బాగా ఆడుతున్నావ్ అని చెప్పిన సుమన్ భార్య.. నీకు ఇష్టమని ఫుడ్ తెచ్చానని చెప్పింది. ఇది ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.

నువ్వు తిను, నువ్వు తిను అంటూ సుమన్, అతడి భార్య ఒకరికి ఒకరు ఆప్యాయంగా తినిపించుకున్నారు. ఇది అయిన తర్వాత గార్డెన్ ఏరియాలో ఇద్దరూ కలిసి చిన్న స్టెప్పులేస్తూ డ్యాన్స్ చేశారు. అదే టైంలో మిగిలిన హౌస్‌మేట్స్ కూడా వీళ్లని ఎంకరేజ్ చేస్తూ సంతోషంగా గంతులేశారు. ప్రోమోనే ఇంత బాగుందంటే.. ఎపిసోడ్ ఇంకెంత బాగుండబోతుందో?

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు డబ్బింగ్ సినిమా)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)