Breaking News

మరోసారి తండ్రయిన హీరో సుహాస్

Published on Sat, 09/27/2025 - 14:43

'కలర్ ఫోటో' సినిమాతో ఫేమ్ తెచ్చుకుని ఆడపాదడపా మూవీస్ చేస్తున్న హీరో సుహాస్.. ఇప్పుడు మరోసారి తండ్రయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ క్రమంలోనే తోటి సెలబ్రిటీలు, స్నేహితులు.. ఇతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. కడుపు తీయించుకుంది: హీరో ధర్మ మహేశ్‌)

షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించాడు. 'కలర్ ఫోటో' మూవీతో హీరోగా మారి హిట్ కొట్టాడు. 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్' తదితర చిత్రాలు కూడా ఇతడికి బాగానే పేరు తీసుకొచ్చాయి.

అసలు విషయానికొస్తే గతేడాది జనవరిలో సుహాస్ భార్య లలిత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు మరోసారి వీళ్లకు కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని సుహాస్ ప్రకటించాడు. సుహాస్‌ది ప్రేమ వివాహం. ఏడేళ్లు పాటు ప్రేమించుకున్నారు కానీ పెద్దలు నో చెప్పేసరికి లేచిపోయి  2017లో పెళ్లి చేసుకున్నారు. లలిత.. తనకు భార్య అయిన తర్వాత చాలా కలిసొచ్చిందని సుహాస్ గతంలో పలుమార్లు చెప్పాడు. ఇప్పుడు వీళ్ల ప్రేమకు గుర్తుగా ఇద్దరు వారసులు పుట్టారు. ప్రస్తుతం సుహాస్, తెలుగులో రెండు తమిళంలో ఓ సినిమా చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: ఓజీలో పవన్‌ కూతురిగా సాయేషా.. ఎవరీ పాప?)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)