Breaking News

ఫ్రీగా సినిమాలు చేశా.. అడిగితే ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు: సుదీప్

Published on Sun, 12/28/2025 - 14:46

కన్నడ హీరో సుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమే. ఎందుకంటే సొంత భాషలో స్టార్ అయినప్పటికీ మన దగ్గర 'ఈగ'లో ప్రతినాయకుడిగా అదరగొట్టేశాడు. తర్వాత కూడా బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాల్లో అతిథి పాత్రలు పోషించాడు. టాలీవుడ్‌లోనూ కాసోకూస్తో ఫేమ్ సొంతం చేసుకున్నాడు. అయితే తను ఇలా చేస్తున్నప్పటికీ మిగతా ఇండస్ట్రీలకు చెందిన హీరోలు.. తమని సపోర్ట్ చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు.

(ఇదీ చదవండి: 'ఇదే నా చివరి సినిమా'.. అఫీషియల్‌గా ప్రకటించిన విజయ్)

'మిగతా ఇండస్ట్రీల నుంచి కన్నడ సినిమాలకు పెద్దగా సపోర్ట్ దొరకట్లేదు. నేను, శివరాజ్ కుమార్, ఉపేంద్ర.. మిగతా భాషల్లో అతిథి పాత్రలు చేశాం. కాకపోతే ఆయా భాషల స్టార్స్ మాత్రం కన్నడలో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. నేను అయితే ఇతర భాషల్లో చేసిన అతిథి పాత్రలకుగానూ డబ్బులే తీసుకోలేదు. వ్యక్తిగతంగా మిగతా ఇండస్ట్రీలోని పలువురు హీరోలని నా మూవీలో అతిథి పాత్రలు చేయమని అడిగా. కానీ వాళ్లు ఆసక్తి చూపించలేదు' అని సుదీప్ చెప్పుకొచ్చాడు.

సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మార్క్'. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజైంది. కాకపోతే డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర నిలబడటం కష్టమే అనిపిస్తుంది. తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తామని తొలుత ప్రకటించారు కానీ తర్వాత ఎందుకో వెనక్కి తగ్గారు.

(ఇదీ చదవండి: రాసిపెట్టుకోండి.. 'రాజాసాబ్'కి రూ.2000 కోట్లు వస్తాయి: సప్తగిరి)

Videos

పిడుగురాళ్ల CI వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం

చిరు, వెంకీ ఊరమస్ స్టెప్స్..!

ఆపరేషన్ సిందూర సమయంలో భారత్ దెబ్బకు పారిపోయి దాక్కున్నాం

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

Photos

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)