Breaking News

ఓటీటీలో టాప్ వెబ్ సిరీస్.. ఫైనల్లీ గుడ్ న్యూస్

Published on Sun, 06/01/2025 - 17:50

గత నాలుగైదేళ్లుగా ఓటీటీల వాడకం చాలా పెరిగిపోయింది. అన్ని భాషల సినిమాలు, వెబ్ సిరీసులు తెగ చూసేస్తున్నారు. మూవీస్ సంగతి కాసేపు పక్కనబెడితే ఇంగ్లీష్‌లో అదిరిపోయే సిరీసులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి 'స్ట్రేంజర్ థింగ్స్'. నెట్‌ఫ్లిక్స్ అంటే గుర్తొచ్చే సిరీస్‌ల్లో ఇది కచ్చితంగా టాప్‌లో ఉంటుంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పేశారు.

ఇప్పటివరకు 'స్ట్రేంజర్ థింగ్స్' నుంచి నాలుగు సీజన్లు రిలీజయ్యాయి. ఇవి వేటికవే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. చివరగా 2022లో నాలుగో సీజన్ వచ్చింది. అప్పటినుంచి ఐదో సీజన్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్. కొన్నాళ్ల క్రితం 2025లోనే వస్తుందని అన్నారు గానీ డేట్ ప్రకటించారు. ఇప్పుడు ఆ విషయమై క్లారిటీ ఇచ్చేశారు.

(ఇదీ చదవండి: శ్రీలీల పెళ్లి కాదు.. అసలు నిజం ఇది)

ఐదో సీజన్‌ని మూడు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 26న 'వాల్యూమ్ 1', క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న 'వాల్యూమ్ 2', న్యూఇయర్ కానుకగా జనవరి 1న 'ఫైనల్ ఎపిసోడ్' స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో పాత్రధారుల లుక్, సీన్స్ ఆసక్తి కలిగించేలా ఉన్నా.యి.

'స్ట్రేంజర్ థింగ్స్' విషయానికొస్తే.. అమెరికాలోని హాకిన్స్ అనే ఓ ఊరిలో నలుగురు పిల్లలు స్నేహితులుగా ఉంటారు. ఓరోజు అనుకోకుండా అతీంద్రయ శక్తులున్న ఎలెవన్ అనే అమ్మాయి వీళ్ల దగ్గరకొస్తుంది. ఈమె రాకతో సదరు ఊరిలో ఎలాంటి వింతలు, విడ్డూరాలు జరిగాయి? ఏమైందనేదే సింపుల్‌గా స్టోరీ. చూడటానికి చిన్నపిల్లలా సినిమాల ఉంటుంది గానీ విజువల్స్, స్టోరీ అన్నీ టాప్ నాచ్ ఉంటాయి.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)