Breaking News

అమ్మ ఉంటే చాలా సంతోషించేది.. హీరోయిన్ ఎమోషనల్

Published on Sat, 07/25/2026 - 14:46

ఈ వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో 'చెన్నై లవ్ స్టోరీ'కి పాజిటివ్ టాక్ వస్తోంది. ‍సెకండాఫ్ మీద కంప్లైంట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా పర్లేదని అంటున్నారు. మరోవైపు ఇందులో హీరోయిన్‌గా చేసిన తెలుగమ్మాయి శ్రీ గౌరిప్రియకి ప్రశంసలు దక్కుతున్నాయి. అన్ని రకాల ఎమోషన్స్ అద్భుతంగా పండిందని అంతా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈమె, సక్సెస్ మీట్‌లో అమ్మని తలుచుకుని ఎమోషనల్ అయింది.

(ఇదీ చదవండి: రిలీజ్ రోజే కలెక్షన్స్ పోస్టర్.. ఇదేం విడ్డూరం?)

'ఇంత మంచి పేరు, విజయం వస్తున్నప్పుడు మా అమ్మ ఉండి ఉంటే చాలా సంతోషించేవారు. నన్ను ఇప్పుడు ఆమె చూసి ఉంటే బాగుండేదని అందరూ అంటున్నారు. కానీ మా అమ్మ ఎప్పుడూ పైనుంచి నన్ను చూస్తూనే ఉంటుంది' అని గౌరిప్రియ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

కిరణ్ అబ్బవరం, గౌరిప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో రవి నంబూరి దర్శకుడిగా పరిచయమయ్యారు. 'బేబి' తీసిన దర్శకుడు సాయి రాజేశ్.. ఈ చిత్రానికి కథ అందించారు. ఎస్కేఎన్ నిర్మించారు. ఇకపోతే ప్రీమియర్లకే రూ.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. తొలిరోజు మరో రూ.6 కోట్ల వసూళ్లు.. అంటే ఓవరాల్‌గా ఇప్పటివరకు రూ.9 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.

(ఇదీ చదవండి: చెన్నై లవ్ స్టోరీ.. కిరణ్, శ్రీ గౌరి చేయాల్సింది కాదు..!)

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)