Breaking News

అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది

Published on Sat, 07/11/2026 - 17:10

అఖిల్ ఎట్టకేలకు హిట్ కొట్టాడు. 'లెనిన్'కి దాదాపుగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. తొలిరోజు కొందరి నుంచి మిశ్రమ స్పందన వినిపించినప్పటికీ ఓవరాల్‌గా అయితే రెస్పాన్స్ బాగుంది. తొలి సక్సెస్ అందుకునేసరికి అటు అఖిల్, ఇటు భాగ్యశ్రీ ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే టైంలో హీరోయిన్ శ్రీలీలని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: ‘లెనిన్‌’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..?)

శ్రీలీలపై చాలామంది నెటిజన్లు విమర్శలు చేయడానికి ఓ కారణం కనిపిస్తోంది. 'లెనిన్' సినిమాని ప్రకటించి ఓ వీడియో రిలీజ్ చేసినప్పుడు మొదటగా అనుకున్న హీరోయిన్ శ్రీలీలనే. అయితే తర్వాత ఈమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే వచ్చి చేరింది. సినిమాలోని ఈమె ఫెర్ఫార్మెన్స్, గ్లామర్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఒకవేళ ఇదే ప్లేసులో శ్రీలీల ఉండుంటే కచ్చితంగా ఇలా చేసేది కాదని, సినిమాకు మైనస్ అయ్యిండేదని సోషల్ మీడియాలో పలువురు ట్రోల్స్ చేస్తున్నారు.

ఒకవేళ నిజంగా శ్రీలీల.. 'లెనిన్' సినిమా చేసుంటే ఎలా ఉండేదో ఏమో గానీ సోషల్ మీడియాలో ఈమెని విమర్శించడం ఎక్కువైపోయింది. గతంలో శ్రీలీల తెలుగులో చాలా మూవీస్ చేసింది గానీ వీటిలో 'ధమాకా' తప్పితే మిగతా ఏది కూడా హిట్ కాలేదు. రొటీన్ క్యారెక్టర్స్ చేస్తుందని శ్రీలీలపై గతంలోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఫ్రెష్‌గా 'లెనిన్' ప్రస్తావన తీసుకొచ్చి ఈమెని టార్గెట్ చేస్తున్నారు.

ఈ ఏడాది రిలీజైన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో శ్రీలీల చివరగా కనిపించింది. ఇదెంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం హిందీలో ఒకటి, తమిళంలో మరొకటి చేస్తోంది. అసలు తెలుగులో కొత్తగా ఏం మూవీస్ చేయనప్పటికీ ట్రోలింగ్ వల్ల మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

(ఇదీ చదవండి: మా వాడికి హిట్ ఇవ్వమని దేవుడిని అడిగా.. పెళ్లయ్యాక అఖిల్ టైమ్ మొదలైంది)

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)