Breaking News

నెలలు గడిచినా నన్ను పంపించలేదు.. నా భార్య భయపడిపోయి

Published on Sat, 08/29/2026 - 21:17

సినిమా చూస్తున్నప్పుడు సరదాగా ఉంటుంది. కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడో ఓసారి సదరు చిత్రాల్లో నటించిన వాళ్లు చెబితే తప్పితే ఆ సంగతులు బయటపడవు. ఇప్పుడు అలానే తమిళ హీరో సూరి.. 'మండాడి' చిత్రం విషయంలో తనకెదురైన చిత్రమైన ఫన్నీ అనుభవాన్ని పంచుకున్నాడు. చెన్నైలో శుక్రవారం జరిగిన ఆడియో లాంచ్ సందర్భంగా ఇదంతా చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: తమిళ హీరో కాళ్లు మొక్కిన తెలుగు హీరో సుహాస్)

'మండాడి సినిమా కమిట్ అయినప్పుడు 80 శాతం చిత్రీకరణ స్విమ్మింగ్ పూల్‌లో, 20 శాతం నిజమైన సముద్రంలో చేస్తామని దర్శకుడు చెప్పారు. వెట్రిమారన్ కూడా.. టైటానిక్ సహా ఎన్నో సముద్ర నేపథ్య సినిమాలు స్విమ్మింగ్ పూల్‌లోనే తీశారని చెప్పారు. దీంతో నేను ఓకే అనేశా. కానీ షూటింగ్ మొదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది'

'10 రోజులు గడిచాయి. నెలరోజులు గడిచాయి. రెండు నెలలు అయిపోయాయి. అయినా షూటింగ్ మాత్రం నిజమైన సముద్రంలో చేస్తున్నారు. నన్ను ఇక్కడి నుంచి పంపించకపోయేసరికి నా భార్య తెగ భయపడిపోయి ప్రతిరోజూ ఫోనే చేసేసేది. కానీ నేను ఎత్తలేకపోయేవాడిని. దీంతో రెండురోజులకు ఓసారి నేనే ఆమెకు ఫోన్ చేసి 'నేను బతికే ఉన్నాను' అని చెప్పేవాడిని' అని సూరి నవ్వుతూ ఈ సినిమా అనుభవాన్ని పంచుకున్నాడు.

తెలుగు హీరో సుహాస్ ఈ మూవీలో విలన్‌గా చేశాడు. వచ్చే నెల 10వ తేదీన తెలుగు, తమిళంలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. పూర్తిగా సముద్రం బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. అయితే సముద్రంలో తీస్తున్న టైంలో ఒకటిరెండుసార్లు ప్రమాదాలు కూడా జరిగాయి.

(ఇదీ చదవండి: 40 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులకు కారణం నేనే: 'జైలర్' విలన్)

Videos

బిర్యానీ సెంటర్లో పెరుగు కోసం కొట్లాట

కీవ్ లో రష్యా డ్రోన్ల బీభత్సం.. 37 మంది మృతి

నువ్వేం ఎమ్మెల్యే అమ్మ బాబు.. తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతకాలేదు నీకు..!

'అచ్చ కాంగ్రెస్' వర్సెస్ 'పచ్చ కాంగ్రెస్' రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతు ఉందా?

మనిషి కంట్రోల్ తప్పిన 700 రోబోల రహస్య దాడి!

ఇరుముడి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

మందాకిని ఉగ్రరూపం.. వరదల్లో ఉత్తర ప్రదేశ్

2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు

జనసేనలో బిగ్ ఫైట్.. లోకల్ ఎన్నికల్లో భారీ ఓటమి ఖాయం

వెలిగొండ వెలుగులు జగన్ వే

Photos

+5

చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

+5

షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు)

+5

ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)

+5

'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)

+5

నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు

+5

మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దేవకన్యలా మెరిసిపోతున్న రాశీ (ఫొటోలు)