Breaking News

హీరో విజయ్ గెలుపు.. పవన్ కల్యాణ్‌పై ట్రోల్స్..!

Published on Mon, 05/04/2026 - 14:27

తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ చరిత్ర సృష్టించాడు. తొలిసారి సింగిల్‌గా బరిలోకి దిగిన విజయ్ మ్యాజిక్ ఫిగర్‌ దిశగా దూసుకెళ్తున్నారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి చూపు తమిళనాడుపై పడింది. రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్‌ విజయంపై అభినందనలు చెబుతున్నారు.

అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ట్రోల్స్ మొదలయ్యాయి.   విజయ్ విజయాన్ని కొందరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోల్చుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తొలి ఎన్నికల్లో సాధించిన ఫలితాలను ప్రస్తావిస్తున్నారు. విజయ్‌లా పవన్ కల్యాణ్ తొలిసారి విజయం సాధించలేకపోయారని ఎద్దేవా చేస్తున్నారు. విజయ్ పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే ఏకంగా సీఎం కాబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంలో తొలిసారి పోటీ చేసిన రెండు స్థానాల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

అయితే తమిళనాడు, ఏపీ రాజకీయాలను ముడిపెట్టొద్దని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో  రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవని అంటున్నారు. ఈ సందర్భంగా గతంలో తమిళనాడు రాజకీయాల్లో విజయవంతమైన ఎంజీఆర్, జయలలిత లాంటి వాళ్లను పేర్లను ప్రస్తావిస్తున్నారు. అక్కడ ప్రజలు సినీ నేపథ్యం ఉన్న నాయకులను సులభంగా అంగీకరిస్తారని చెబుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం ప్రాంతీయ రాజకీయాలు, బలమైన పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని భావిస్తున్నారు.

 

Videos

LIVE : దూసుకుపోతున్న విజయ్

సీఎం స్టాలిన్ ఓటమి...! విజయ్ దెబ్బ అదుర్స్

తమిళనాడులో విజయ్ తుఫాన్, దళపతికి పట్టం కట్టిన ZenG

నా తమ్ముడు విజయ్... జగన్ ఎమోషనల్ కామెంట్స్

విజయ్ విజయం త్రిష సంచలన కామెంట్స్

DMK ఓటమికి కారణం ఇదే..

విజయంపై విజయ్ తల్లి ఫస్ట్ రియాక్షన్

ఇక్కడ జగన్.. అక్కడ విజయ్, TVK విజయోత్సవంలో YSRCP సంబరాలు

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయంపై NV. సుభాష్

విజయ్ గెలుపుపై తండ్రి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

విజయ్‌ ఇంటి దగ్గర భారీ భద్రత.. అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

విజయ్‌ విజిల్‌ మోత.. రీసౌండ్‌ ఓ రేంజ్‌లోనే.. (ఫొటోలు)

+5

తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ.. తిరుమలలో త్రిష ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

43 ఏళ్ల 'యంగ్' హీరోయిన్ త్రిష బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆహ్లాదకర వేళ.. బీచ్‌లో సందడి (ఫొటోలు)

+5

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)

+5

కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా స్నేహ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 03-10)