Breaking News

పెళ్లి తర్వాత శోభిత తొలి సినిమా.. నేరుగా ఓటీటీలో రిలీజ్!

Published on Thu, 10/09/2025 - 12:44

నాగచైతన్య గతేడాది డిసెంబరులో శోభితని పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పటి నుంచి శోభిత కొత్త ప్రాజెక్టులు ఒప్పుకొన్నట్లు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. రీసెంట్‌గా ఓ తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే శోభిత.. ఓటీటీ మూవీని పూర్తి చేసిందని, వచ్చే నెలలోనే ఇది రిలీజ్ కానుందని ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

(ఇదీ చదవండి: నాగార్జునతో టబు.. మళ్లీ ఇన్నేళ్లకు జంటగా!)

వైజాగ్‌కి చెందిన శోభిత.. తొలుత మోడలింగ్ చేసింది. 2016 నుంచి సినిమాలు చేస్తోంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. మేడ్ ఇన్ హెవెన్, బార్డ్ ఆఫ్ బ్లడ్, ద నైట్ మేనేజర్ లాంటి వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేసింది. అయితే 'చీకట్లో' అనే ఓటీటీ మూవీలో శోభిత నటించింది. కానీ దీని గురించి ఎక్కడా చిన్న అప్‌డేట్ కూడా లేదు. సురేశ్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడట.

'చీకట్లో' పేరుతో తీసిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబరు 18న రిలీజ్ చేయబోతున్నారట. అయితే ఈ మూవీని ఏకంగా 18 భాషల్లో డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్‌లోకి తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఇదంతా అనధికారికంగా బయటకొచ్చిన ఇన్ఫర్మేషన్. త్వరలో ఈ మూవీ గురించి అధికారిక ప్రకటనతో పాటు ఇతర వివరాలు కూడా రావొచ్చు. శోభిత భర్త, హీరో నాగచైతన్య ప్రస్తుతం హారర్ జానర్‌లో ఓ సినిమా చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: క్రేజీగా ప్రదీప్-మమిత 'డ్యూడ్' ట్రైలర్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)