Breaking News

'స్కంద' ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

Published on Thu, 09/28/2023 - 16:51

సెప్టెంబరు 28 పేరు చెప్పగానే మొన్నటివరకు 'సలార్' గుర్తొచ్చేది. కానీ అది వాయిదా పడేసరికి ఈ తేదీ కోసం మిగతా సినిమాలన్నీ పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే రామ్ 'స్కంద' ఇదేరోజున అంటే తాజాగా థియేటర్లలోకి వచ్చింది. బోయపాటి మార్క్ సినిమాల తరహాలోనే ఇది ఉంది. యాక్షన్  ప్రియుల్ని అలరిస్తున్న ఈ చిత్రం అలానే ఓటీటీ పార్ట్‌నర్‌తో పాటు స్ట్రీమింగ్ టైమ్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

'స్కంద' కథేంటి?
ఏపీ ముఖ్యమంత్రి (అజయ్ పుర్కన్) కూతురి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ వేడుకకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి (శరత్ లోహితస్వ) కొడుకుతో లేచిపోతుంది. దీంతో సీఎంలు ఇద్దరూ ఒకరిపై ఒకరు పగ పెంచుకుంటారు. తన కూతురిని తిరిగి రప్పించడం కోసం ఏపీ సీఎం ఓ కుర్రాడిని(రామ్ పోతినేని) తెలంగాణకు పంపిస్తాడు. తెలంగాణ సీఎంకి ఓ కూతురు (శ్రీలీల) ఉంటుంది. ఓ సందర్భంలో ఈ కుర్రాడు.. ఇద్దరు ముఖ్యమంత్రుల కుమార్తెలని తీసుకెళ్లిపోతాడు. అసలు ఈ కుర్రాడెవరు? ఎందుకు తీసుకెళ్లాడనేది 'స్కంద' స్టోరీ.

(ఇదీ చదవండి: Skanda Movie Review: ‘స్కంద’ మూవీ రివ్యూ)

ఎలా ఉంది?
బోయపాటి గత సినిమాల్లో ఓ మాదిరిగా అయినా కథ ఉండేది. ఇందులో పెద్దగా అలాంటిదేం లేదు. కమర్షియల్ చిత్రాల్లో నలిగిపోయిన రొటీన్ రివేంజ్ డ్రామానే తీసుకున్నాడు. కానీ సినిమా మొదలైన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు తనదైన మార్క్ సన్నివేశాలతో నడిపించేశాడు. యాక్షన్ లవర్స్, మాస్ ఆడియెన్స్‌కి ఇది నచ్చేయొచ్చు కానీ మిగతా వాళ్లకు కాస్త కష్టమే.

ఓటీటీ డీటైల్స్
ఇకపోతే రిలీజ్‌కి ముందే 'స్కంద' మూవీ డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‪‌స్టార్ సంస్థ దక్కించుకుంది. చేసుకున్న ఒప్పందం ప్రకారం నెల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుందట. అంటే సెప్టెంబరు 28న థియేటర్లలోకి సినిమా వచ్చింది కాబట్టి అక్టోబరు చివరి వారంలో ఇందులో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రావొచ్చని సమాచారం. కొన్నిరోజులు ఆగితే దీనిపై క్లారిటీ వచ్చేస్తుందిలే!

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)