Breaking News

ఓటీటీలోకి వచ్చిన హాలీవుడ్ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published on Tue, 12/16/2025 - 13:21

ఓటీటీలోకి మరో క్రేజీ హాలీవుడ్ యాక్షన్ మూవీ వచ్చేసింది. గత నెలలో రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్. ఇంతకీ ఏంటీ సినిమా? ప్రస్తుతం ఎందులో చూడొచ్చు?

2022లో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై యాక్షన్ మూవీ లవర్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చిన సినిమా 'శిశు'. కేవలం గంటన్నర నిడివి మాత్రమే ఉండే ఈ మాస్ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీనికి కొనసాగింపుగా గత నెల 21న 'శిశు: రోడ్ టు రివెంజ్' చిత్రం రిలీజైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. ఈసారి కూడా యాక్షన్ సీన్స్ అదిరిపోయాయనే చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ఎలాంటి ప్రకటన లేకుండా వచ్చేసింది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి విదేశాల్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ మన దేశంలోనూ ఓటీటీలో రిలీజయ్యే అవకాశముంది. ఈ సినిమా కూడా గంటన్నర నిడివితోనే తెరకెక్కించారు. మొదటి సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఓన్లీ యాక్షనే ఉంటుంది.

'శిశు: రోడ్ టు రివెంజ్' విషయానికొస్తే.. రెండో ప్రపంచ యుద్ధంలో తన కుటుంబాన్ని పోగొట్టుకున్న అటామి కోర్పి(జోర్మా).. తన ఫ్యామిలీ కోసం గుర్తుగా నిర్మించిన ఇంటి చెక్క మొత్తాన్ని ప్యాక్ చేసుకొని వేరే ప్రాంతానికి వెళ్తుంటాడు. ఇది తెలుసుకున్న రెడ్ ఆర్మీ చీఫ్ ఇగోర్ (స్టీఫెన్ లాంగ్) అటామిని చంపేందుకు ఆర్మీతో సహా చిన్నపాటి యుద్ధం ప్రకటిస్తాడు. ఈ భీకర పోరాటంలో అటామి ఎలా గెలిచి, ఇల్లు కట్టుకోవాలనే తన కల నెరవేర్చుకున్నాడనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలో రొమాంటిక్ కామెడీ ఫీల్ గుడ్ సినిమా.. తెలుగు రివ్యూ)

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)