15 ఏళ్ల వివాహ బంధానికి బుల్లితెర నటి గుడ్‌ బై..!

Published on Wed, 09/03/2025 - 15:56

సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం కామన్‌గా అయిపోయింది. కొన్నేళ్ల పాటు కలిసి ఉన్న జంటలు అభిమానులకు సడన్‌గా ఇలాంటి షాక్‌లు ఇస్తుంటారు. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి సింపుల్ కౌల్ తన వివాహా బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. 15 ఏళ్ల తర్వాత తన భర్త, వ్యాపారవేత్త రాహుల్ లూంబాతో విడిపోతున్నట్లు ప్రకటించింది.

(ఇది చదవండి: చెఫ్‌గా మారిన శోభిత ధూళిపాళ్ల.. నాగచైతన్య కామెంట్ చూశారా?)

భర్తతో విడాకులపై సింపుల్ కౌల్ మాట్లాడుతూ.. "అవును మేమిద్దరం ఇటీవలే విడిపోయాం. మేము పరస్పరం చాలా పరిణతి చెందిన మనుషులం. నా జీవితంలో చాలా సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నా. ఇకపై మేమిద్దరం పరస్పర నిర్ణయంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం' అని తెలిపింది. 

గత ఇంటర్వ్యూలో సింపుల్ కౌల్ మాట్లాడుతూ.."అతను విదేశాల్లో ఎక్కువ రోజులు ఉంటారు. కొన్నిసార్లు నేను అతనిని మిస్ అవుతూ ఉంటా. కానీ మా మధ్య మంచి అవగాహన ఉంది. మా బంధం చాలా బలంగా ఉంటుంది. అందుకే మా జీవితాన్ని సమతుల్యంగా చేసుకున్నా. ఆయన లేనప్పుడు నా కెరీర్‌పై కూడా దృష్టి పెట్టగలుగుతున్నా. మా ఇద్దరికీ సంతోషకరమైన పనితో పాటు జీవితంలో సమానంగా ఎదుగుతున్నాం" అని తెలిపింది.

కాగా.. సింపుల్ కౌల్, రాహుల్ లూంబా 2010లో వివాహం చేసుకున్నారు. కుస్సుమ్‌తో తన కెరీర్ ప్రారంభించిన సింపుల్ కౌల్ పలు బాలీవుడ్ సీరియల్స్‌లో మెప్పించింది. అంతేకాకుండా 'శరరత్', 'తారక్ మెహతా కా ఊల్తా చాష్మా', 'యే మేరీ లైఫ్ హై' వంటి అనేక ప్రముఖ రియాలిటీ షోలలో కనిపించింది. సింపుల్ కౌల్ చివరిసారిగా 2022లో జిద్ది దిల్ మానే నా అనే సీరియల్‌లో కనిపించారు. అయితే విడిపోవడానికి గల కారణాన్ని ఆమె వెల్లడించలేదు.

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)