అన్నా నేనే హీరోయిన్.. శ్రుతి హాసన్‌కి వింత అనుభవం

Published on Sat, 08/16/2025 - 20:53

సెలబ్రిటీలకు అప్పుడప్పుడు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. వెంటనే అవి కాస్త వైరల్ అవుతుంటాయి. తాజాగా హీరోయిన్ శ్రుతి హాసన్‌కి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ ఏమైంది? శ్రుతి హాసన్ ఎందుకు బతిమాలాడుకోవాల్సి వచ్చింది.

తమిళ బ్యూటీ అయిన శ్రుతి హాసన్.. రీసెంట్ టైంలో ఆడపాదడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు 'కూలీ'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈమె పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే రిలీజ్ నాడే మూవీ చూద్దామని చెన్నైలో ఓ థియేటర్‪‪‌కి వెళ్లగా అక్కడి సెక్యూరిటీ గార్డ్ ఈమె ఉన్న కారుని ఆపేశాడు. దీంతో శ్రుతి హాసన్ అవాక్కయింది.

(ఇదీ చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ)

దీంతో సదరు సెక్యూరిటీ గార్డ్‌తో.. 'నేను సినిమాలో ఉన్నాను. దయచేసి నన్ను లోపలికి అనుమతించండి అన్నా. నేనే హీరోయిన్ సార్' అని శ్రుతి హాసన్ బతిమలాడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని తమిళ ర్యాపర్ యుంగ్ రాజా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోని చూసి నెటిజన్లు సరదాగా నవ్వుకుంటున్నారు.

'కూలీ' విషయానికొస్తే.. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. కానీ తొలిఆటకే మిశ్రమ స్పందన వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం తొలిరోజు ఏకంగా రూ.151 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. రెండో రోజు మాత్రం ఎంతొచ్చింది ఏంటనేది చెప్పలేదు. రూ.85 కోట్ల మేర వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అంటే ఇప్పటివరకు రూ.240 కోట్ల మేర వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: 'కూలీ'తో సక్సెస్.. కాస్ట్‌లీ కారు కొన్న నటుడు సౌబిన్)

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)