Breaking News

అసలు ఈ డిజాస్టర్‌ ఏంటి?.. ఆ సాంగ్‌పై షోయబ్ అక్తర్‌ ఆసక్తికర కామెంట్స్!

Published on Wed, 06/28/2023 - 13:48

ఒకప్పుడు బాలీవుడ్ అంటే మెలోడీ సాంగ్స్, హిట్ సినిమాలే గుర్తొచ్చేవి. కానీ ఆ పరిస్థితి తలకిందులైంది. ఇటీవల పఠాన్ సినిమా మినహాయిస్తే వరుస ఫ్లాప్ సినిమాలే దర్శనమిస్తున్నాయి. అయితే బాలీవుడ్‌ ఇండస్ట్రీ రీమేక్‌లపై ఆధారపడిందంటూ పలువురు సినీ ప్రముఖుల నుంచి విమర్శలొచ్చాయి. దీంతో రోజు రోజుకీ హిందీ చిత్రాల పరిస్థితి మరింత దిగజారిపోతోంది.

(ఇది చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!)

దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో పోటీ పడుతుంటే.. బాలీవుడ్ మాత్రం ఇంకా రీమేక్‌లపైనే ఆధారపడుతోంది. అయితే ఈ సారి ఏకంగా ఓ పాకిస్థానీ పాటను రీమేక్ చేయడంతో బాలీవుడ్ రేంజ్ మరింత దిగజారింది. యంగ్ హీరో ఇటీవలే అల వైకుంఠపురములో చిత్రాన్ని హిందీలో 'షెహజాదా' పేరుతో రీమేక్ చేసి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. 

అయితే తాజాగా ఆయన నటించిన సత్యప్రేమ్‌ కీ కథ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో గ్లోబల్‌ స్థాయిలో ఫేమస్ అయిన పాకిస్థానీ పాట 'పసూరి'ని రీమేక్ చేశారు. గతేడాది ఎక్కువమంది యూట్యూబ్ లో వెతికిన వాటిలో ఈ సాంగ్ అగ్రస్థానంలో నిలిచింది. దీన్నే కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా 'సత్యప్రేమ్ కీ కథ' చిత్రంలో వాడేశారు. 

ఇప్పటికే చిత్రబృందం ఈ సాంగ్ రిలీజ్ చేయగా నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సైతం స్పందించారు. ఈ మేరకు ఆయన కాస్తా ఫన్నీగా ట్వీట్ చేశారు. అసలేంటీ ఈ డిజాస్టర్ అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్స్ కూడా అదేస్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. 

(ఇది చదవండి: ఇప్పుడే బ్రేక్‌ ఫాస్ట్ కూడా చేశా.. విడాకులపై గజినీ హీరోయిన్!)
 
 కాగా.. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిస్తోన్న సత్య ప్రేమ్ కి కథ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. భూల్ భూలయ్యా- 2 తర్వాత ఈ జంట మరోసారి ప్రేక్షకులను అలరించనుంది.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)