Breaking News

నటికి లవ్‌ లెటర్‌ రాశా: శివాజీ రాజా

Published on Wed, 11/26/2025 - 08:24

చిన్న సినిమాగా వచ్చిన "రాజు వెడ్స్‌ రాంబాయి" మూవీ (Raju Weds Rambai Movie)కి మంచి ఆదరణ లభిస్తోంది. మంచి కలెక్షన్స్‌ రాబడుతూ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో సీనియర్‌ నటుడు శివాజీ రాజా ఓ సరదా విషయాన్ని బయటపెట్టాడు.

ప్రేమలేఖ
శివాజీ రాజా మాట్లాడుతూ.. అనిత చౌదరి, నేను చాలా సినిమాలు చేశాం. మురారి సమయంలో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. దర్శకుడు కృష్ణవంశీ ఖాళీగా కూర్చోకుండా ఓ లవ్‌ లెటర్‌ రాయమన్నాడు. అచ్చ తెలుగు భాషలో, పశ్చిమ గోదావరి యాసలో అనితకు ప్రేమలేఖ రాశా.. ఆమె ఒక్కతే చదువుకోవచ్చుగా! 

ఆస్పత్రిలో ఉండగా నా భార్యకు..
యూనిట్‌ అందరికీ ఇచ్చింది. నాకు యాక్సిడెంట్‌ అయి ఆస్పత్రిలో ఉంటే అక్కడికి వచ్చి నా భార్యకు లవ్‌లెటర్‌ చూపించింది అని గుర్తు చేసుకున్నాడు. గతంలో ఎన్నో సినిమాల్లో జంటగా నటించిన శివాజీ రాజా- అనిత.. రాజు వెడ్స్‌ రాంబాయి మూవీలో భార్యాభర్తలుగా యాక్ట్‌ చేశారు. అనిత.. గోల్‌మాల్‌, సంతోషం, నువ్వే నువ్వే, ఉయ్యాల జంపాల, వరుడు, మన్మథుడు, తులసీదళం వంటి పలు సినిమాల్లో నటించింది. అలాగే పలు సీరియల్స్‌ చేసింది.

సినిమా
శివాజీ రాజా.. ప్రేమంటే ఇదేరా, పెళ్లి సందడి, మావిచిగురు, నిన్నే ప్రేమిస్తా, మురారి, నరసింహనాయుడు, నీ స్నేహం, వర్షం, మొగుడ్స్‌ పెళ్లాంస్‌ ఇలా అనేక సినిమాలు చేశాడు. బుల్లితెరపై అమృతం సీరియల్‌లో యాక్ట్‌ చేశాడు. అలాగే మరికొన్ని ధారావాహికల్లోనూ మెప్పించాడు.

చదవండి: అమ్మను అవమానించారు: మృణాల్‌ ఠాకూర్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)